Asianet News TeluguAsianet News Telugu

ఇండో-పాక్‌ సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్ ను కూల్చిన భద్రతా బలగాలు.. 5 కిలోల హెరాయిన్ స్వాధీనం

ఇండో - పాక్‌ సరిహద్దుల్లో ఓ డ్రోన్ ను భద్రతా బలగాలు కూల్చేశాయి. అందులో నుంచి 5 కిలోల హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాయి. 

Security forces shot down a drone flying on the Indo-Pak border, seized 5 kg of heroin
Author
First Published Dec 2, 2022, 4:44 PM IST

భారత్‌-పాక్‌ సరిహద్దులోని తరన్ తరణ్‌ జిల్లాలో ఎగురుతున్న హెక్సాకాప్టర్‌ డ్రోన్‌ను పంజాబ్‌ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం కూల్చేశాయి. అందులో నుంచి 5 కిలోల బరువున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఈ విషయాన్ని పంజాబ్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.

యూపీ ఉపముఖ్యమంత్రికి సీఎం సీటు ఆఫర్ ఇచ్చిన అపోజిషన్ పార్టీ.. డిప్యూటీ సీఎం ఏం అన్నారంటే?

‘‘బీఎస్ఎఫ్ జవాన్లు, తరన్ తరణ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఆధునిక సాంకేతికతతో కూడిన హెక్సాకాప్టర్ డ్రోన్‌ను ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని పొలాల సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 5 కిలోల బరువున్నహెరోయిన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ’’ అని పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు.

పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు అనేక డ్రోన్‌లు తుపాకీతో కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 30వ తేదీన కూడా తరన్ తరణ్‌లోని వాన్ తారా సింగ్ గ్రామంలో బీఎస్ఎఫ్ ఒక డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. నవంబర్ 28న బీఎస్ఎఫ్ సైనికులు తుపాకీతో కాల్చడంతో అది పొలంలో పడిపోయింది. రెండు రోజుల తరువాత దానిని స్వాధీనం చేసుకున్నారు. తమ శోధనలో ముళ్ల కంచె సమీపంలోని పొలంలో ఆ డ్రోన్ లభించినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రీతీందర్ సింగ్ తెలిపారు.

ఛత్తీస్‌ఘడ్ బస్తర్ లో ఘోర ప్రమాదం: సున్నపు రాయి గని కూలి ఏడుగురు మృతి 

అలాగే కలాష్ హవేలియన్ గ్రామంలో నవంబర్ 28వ తేదీన 7.5 కిలోల హెరాయిన్‌తో పాటు మరో హెక్సాకాప్టర్‌ను పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి డ్రోన్‌ వచ్చిందన్న అనుమానంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు రంగంలోకి దిగారు. దాదాపు 20 కిలోల బరువున్న ఆ హెక్సాకాప్టర్ భారీ పేలోడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇది సరుకును వదిలివేసిన తర్వాత తిరిగి తన ప్రదేశానికి వచ్చే టెక్నాలజీతో రూపొందించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రాన్ని సురక్షితంగా, భద్రంగా మార్చడానికి నిబద్ధతలో డ్రైవ్స్ నిర్వహిస్తున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. ‘‘సీఎం దార్శనికత ప్రకారం రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచడానికి పంజాబ్ పోలీసులు కట్టుబడి ఉన్నారు.’’ అని ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios