కర్ణాటకలో ప్రధాని మోడీకి భ్రదతా లోపం..సెక్యూరిటీని దాటుకుని ప్రధాని వద్దకు దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటకలో ప్రధాని మోడీకి భద్రతా లోపం ఏర్పడింది. హుబ్బలిలో ఈ రోజు ర్యాలీలో ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ అభివాదం చేస్తుండగా ఓ యువకుడు హఠాత్తుగా ఆయన వద్దకు దూసుకువచ్చాడు. చాలా సమీపానికి వచ్చిన తర్వాత ఎస్పీజీ ఆ యువకుడిని నిలువరించి వెంటనే దూరంగా తీసుకెళ్లారు.
 

security breach for pm narendra modi in karnatakas hubbali, in which a boy came very close to pm modi

బెంగళూరు: దేశంలోనే అత్యంత పటిష్టవంతంగా ఐదంచెల భద్రతను ప్రధానమంత్రికి కల్పిస్తారు. కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ భద్రతలో లోపం ఏర్పడింది. ప్రధాని ఎస్‌యూవీ కారులో బోర్డు పై నిలబడి ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తుండగా ఓ యువకుడు ఆకస్మికంగా సెక్యూరిటీ జోన్‌లో ప్రత్యక్షం అయ్యాడు. క్షణాల్లోనే అతను ప్రధాని నరేంద్ర మోడీ చెంతకు చేరాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బలిలో చోటుచేసుకుంది.

ప్రధానమంత్రి ఈ రోజు సాయంత్రం 29వ జాతీయ యువతజన ఉత్సవాలను ప్రారంభించాల్సిన షెడ్యూల్ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఉండగా.. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన హుబ్బలి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్పోర్ట్స్ గ్రౌండ్‌కు వెళ్లుతుండగా ఆయన ర్యాలీలో అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. అప్పుడే ఓ యువకుడు వేగంగా సెక్యూరిటీ కవర్‌లోకి దూసుకొచ్చాడు. ప్రధాని మోడీకి మోచేతి దూరం వరకు వెళ్లాడు. 

ఆ యువకుడు ఓ పూల మాలను ప్రధాని మోడీకి వేసి గౌరవించాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, అతను మోడీ వద్దకు చేరుతుండగా సమీపానికి వచ్చిన తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వెంటనే ఆ యువకుడిని పట్టుకుంది. వెంటనే అక్కడి నుంచి బయటకు తోలింది. ఆ యువకుడిని బలగాలు అడ్డుకుంటూ ఉండగా ప్రధాని మోడీ మాత్రం ఆ పూలమాలను స్వీకరించడానికి చేయి చాచినట్టు కనిపించారు.

Also Read: ఈ నెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

దీంతో ఓ సిబ్బంది పూల మాలను ప్రధాని మోడీకి అప్పగించగా.. ప్రధాని దానిని కారులో పెట్టినట్టు ఓ వీడియోలో కనిపించింది. 

అయితే, ఆ యువకుడు అంతటి కట్టుదిట్టంగా భద్రత ఉన్నటువంటి చోట ఎలా ప్రధాని వద్దకు వెళ్లగలిగాడు అనే విషయం అర్థం కాకుండా ఉన్నది. ర్యాలీ అంతా కోలాహలంగా ఉన్నది. వేలాది మంది నినాదాలు చేస్తూ ప్రధానిని స్వాగతిస్తున్నారు. వారంతా బారికేడ్లకు వెలుపలే నిలబడి ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios