Asianet News TeluguAsianet News Telugu

Secret Code: యువకుడి సూసైడ్ నోట్‌లో సీక్రెట్ కోడ్.. పోలీసులు క్రాక్ చేయడంతో ఖంగుతినే విషయం వెలుగులోకి..!

మహారాష్ట్రలో ఓ యువకుడి సూసైడ్ నోట్‌లోని సీక్రెట్ కోడ్ డీకోడ్ చేస్తే.. ఖంగుతినే విషయం వెలుగులోకి వచ్చింది. యువతి మృతదేహం వదిలిన ఏరియాను కోడ్ రూపంలో సూసైడ్ నోట్‌లో రాశాడు. అదే ఏరియాలో పది రోజులు వెతికితే కుల్లిన స్థితిలోని యువతి డెడ్ బాడీ లభించింది.
 

secret code in mans suicide note which led to his girlfriend dead body whom he killed kms
Author
First Published Jan 18, 2024, 9:09 PM IST

Secret Code: మహారాష్ట్రలో ఓ యువకుడు ట్రైన్ ముందుకు దూగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అందులో ఓ సీక్రెట్ కోడ్ మెన్షన్ చేశాడు. పోలీసులు ఆ యువకుడి మొబైల్ పరీక్షించగా.. అందులో ఆయన సూసైడ్ నోట్ ఫొటో కనిపించింది. అందులోని సీక్రెట్ కోడ్‌ను కూడా పరిశీలించి పోలీసులు క్రాక్ చేశారు. ఆ సీక్రెట్ కోడ్ ఓ ఏరియాను చెప్పింది. అక్కడికి వెళ్లి వెతకగా.. యువతి మృతదేహం కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

నవి ముంబయికి చెందిన 19 ఏళ్ల వైష్ణవి బాబర్ డిసెంబర్ 12వ తేదీన సియాన్‌లోని ఆమె కాలేజీకి వెళ్లింది. కానీ, మళ్లీ తిరిగి రాలేదు. వెంటనే ఆమె తల్లి కాలంబోలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే రోజు జూయినగర్ స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్స్ పై వైభవ్ బురుంగాలే డెడ్ బాడీ కనిపించింది. ట్రైన్ ముందుకు దూకి వైభవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.

వైభవ్ మొబైల్ ఫోన్ పరీక్షించగా అందులో ఒక సూసైడ్ నోట్ సేవ్ చేసి ఉన్నట్టు గుర్తించామని ఓ అధికారి వార్తా ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. తాను వైష్ణవిని చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో రాశాడు. ఆ సూసైడ్ నోట్‌లో ‘L01-501’ వంటి కొన్ని కోడ్‌లు ఉన్నాయి. పోలీసులు ఆ కోడ్‌ను డీకోడ్ చేశారు. అది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఓ చెట్టుపై మార్క్ చేసిన కోడ్. దానికి సమీపంలోనే వైష్ణవి డెడ్ బాడీని వైభవ్ పడేశాడు. వైభవ్‌ను దూరం పెడుతున్నదనే ఆక్రోశంతోనే వైష్ణవిని చంపేశాడని ప్రాథమికంగా తెలిసినట్టు పోలీసులు తెలిపారు.

Also Read : Etela Rajender: ఆ లోక్ సభ స్థానం టికెట్ కావాలని అడిగాను: ఈటల.. కరీంనగర్ నుంచి పోటీ పైనా క్లారిటీ

అప్పుడు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. వైష్ణవి కనిపించకుండా పోవడానికి ముందు ఖార్గడ్ కొండల వద్ద వీరిద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించింది. పోలీసుల బృందం, అటవీ శాఖ అధికారులు, ఫైర్ బ్రిగేడ్, సిడ్కో అధికారులు కలిసి వైష్ణవి డెడ్ బాడీ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అది పది రోజులపాటు సాగిందని పోలీసు అధికారి తెలిపారు.

కొన్ని పొదల వద్ద వైష్ణవి డెడ్ బాడీ కనిపించడంతో సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. ఖార్గడ్‌లోని ఓవ్ క్యాంప్ ఏరియా సమీపంలో డంపింగ్ గ్రౌండ్‌లో డెడ్ బాడీని వదిలిపెట్టారు. కుల్లిపోయిన స్థితిలో ఉన్న ఆ డెడ్ బాడీ డ్రెస్, రిస్ట్ వాచ్, ఐడీ కార్డు ఆధారంగా వైష్ణవిదేనని గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios