Etela Rajender: ఆ లోక్ సభ స్థానం టికెట్ కావాలని అడిగాను: ఈటల.. కరీంనగర్ నుంచి పోటీ పైనా క్లారిటీ

ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మల్కాజిగిరి టికెట్ కావాలని అడిగినట్టు ఈటల రాజేందర్ వివరించారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నందున అడగలేదని స్పష్టం చేశారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చారు.
 

etela rajender asked for malkajgiri ticket for lok sabha, he will not change the party kms

Etela Rajender: ఈటల రాజేందర్ పై ఇటీవల ఊహాగాన వార్తలు అధికం అయ్యాయి. ఆయన బీజేపీ వదిలి కాంగ్రెస్‌లో చేరుతున్నారని, ఆ తర్వాత కరీంనగర్ టికెట్‌తో బండి సంజయ్‌ పైనే పోటీ పడతారని వార్తలు వచ్చాయి. ఈటల రాజేందర్ భవిష్యత్ ఎటూ? అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈటల రాజేందర్ ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల, లక్ష్మాజిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

తాను పార్టీ మారడం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బండి సంజయ్ పైనా పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే, మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని, ఆ స్థానం టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరాను అని వివరించారు. కరీంనగర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. కరీంనగర్ ప్రజలు తనను ఆదరించారని వివరించారు. కానీ, కరీంనగర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ  ఉన్నందున ఆ టికెట్ అడలేదని స్పష్టం చేశారు.

Also Read : Davos: నేను రైతు బిడ్డను, మా కల్చర్.. అగ్రికల్చర్: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్

అంతేకాదు, మల్కాజిగిరి కాకున్నా.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. ఇక తాను పార్టీ మారుతానంటూ వస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మరాదని స్పష్టం చేశారు. ఆ వార్తల పై ఆయన మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios