Asianet News TeluguAsianet News Telugu

కేరళలో రెండో కేసు: దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్

కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసు నమోదైంది. దేశంలో తొలిసారిగా మంకీ పాక్స్ కేసు ఈ ఇదే రాష్ట్రంలో నమోదైంది. రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. 

Second Monkeypox Case Reported In Kerala
Author
Kerala, First Published Jul 18, 2022, 4:01 PM IST

తిరువనంతపురం: Kerala  రాష్ట్రంలో రెండో monkey pox కేసు నమోదైంది. ఈ విషయాన్ని Kerala  వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. Dubaiనుండి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకిందని వైద్యులు గుర్తించారు. మంకీపాక్స్ సోనిక వ్యక్తికి 31 ఏళ్ల వయస్సు ఉంటుంది.ఈ నెల 13న దుబాయ్ నుండి కన్నూర్ కు వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.కన్నూరులోని ప్రభుత్వ వైద్యకాలేజీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్టుగా  మంత్రి తెలిపారు

ఈ నెల 12న దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని ఆమె ఈ నెల 14న ప్రకటించారు.  కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుండి నిపుణుల బృందాన్ని పంపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. 

 మంకీపాక్స్ సోకిన రోగితో కలిసి తిరిగిన వారి సమాచారం సేకరించినట్టుగా అధికారులు తెలిపారు. రోగి తల్లిదండ్రులతో పాటు టాక్సీ డ్రైవర్, ఆటో డ్రైవర్లతో పాటు 11 మంది తోటీ ప్రయాణీకుల సమాచారం సేకరించినట్టుగా అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే మంకీపాక్స్ సోకిన రెండో వ్యక్తితో ఎవరెవరు కలిసి తిరిగారనే విషయమై కూడా అధికారులు సమాచారాన్ని సేకరించనున్నారు.దేశంలోని కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖలను రాసింది.  మంకీపాక్స్ కు సంబందించి తీసుకోవాల్సిన చర్యలపై పలు మార్గదర్శకాలను కూడా కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. 

మంకీపాక్స్ సోకిన వారికి జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. మంకీపాక్స్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వారిలో సుమారు 1 శాతం మరణాలు నమోదౌతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 

ఐరోపాలో 86 శాతం, అమెరికాలో 11 శాతం మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, గాబన్, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ వంటి పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి సోకుతుంది. 2003లో 47 మంకీపాక్స్ కేసులు అమెరికాలో నమోదయ్యాయి. 

also read:బెజవాడ చిన్నారికి సాధారణ దద్దుర్లే.. మంకీపాక్స్ కాదు : టెస్టుల్లో నెగిటివ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కూడా దుబాయ్ నుండి వచ్చిన కుటుంబంలో రెండేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు రావడంతో వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించారు. ఆ చిన్నారికి మంకీపాక్స్ సోకలేదని వైద్యశాఖాధికారులు తేల్చి చెప్పారు. ముందు జాగ్రత్తగా చిన్నారి కుటుంబాన్ని కూడా ఐసోలేషన్ లో ఉంచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios