విజయవాడలో చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారి నమూనాలను పుణేలోని ల్యాబ్‌కు పంపారు అధికారులు. అయితే ఈ నివేదికలో చిన్నారికి మంకీపాక్స్ లేదని నిర్ధారణ అయ్యింది

విజయవాడలో చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారి నమూనాలను పుణేలోని ల్యాబ్‌కు పంపారు అధికారులు. అయితే ఈ నివేదికలో చిన్నారికి మంకీపాక్స్ లేదని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు మంకీపాక్స్ నెగిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని తేల్చారు వైద్యులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

కాగా.. Vijayawada లో రెండేళ్ల చిన్నారికి Monkey Pox లక్షణాలు కన్పించాయి. దీంతో చిన్నారి కటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. ఇటీవలనే Dubai నుండి చిన్నారి కుటుంబం విజయవాడకు వచ్చింది. చిన్నారి ఒంటిపై దద్దుర్లు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి నుండి సేకరించిన శాంపిల్స్ ను అధికారులు పుణెలోని ల్యాబ్ కు పంపారు. ఒంటిపై దద్దుర్లు రావడంతో వైద్యశాఖాధికారులు ముందు జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని ఐసోలేషన్ కు తరలించారు. విజయవాడ పాత ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.

ఇకపోతే.. ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పలు రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.జ్వరం, దగ్గు, శరీరంపై దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. మంకీపాక్స్ సోకిన వారి నుండి ఇతరులకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందనుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారిని ఎవరెవరు కలిశారనే విషయాలపై కూడా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరాలు సేకరించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ముగియకముందే మంకీపాక్స్ దేశంలో కలకలం రేపుతుంది. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను వైద్యశాఖాధికారులు పరీక్షించనున్నారు.