Asianet News TeluguAsianet News Telugu

‘‘ నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ’’.. సీజేఐ వ్యాఖ్యలపై దుమారం, సుప్రీం వాదన ఇది

బాలికపై అత్యాచారం కేసులో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం నిందితుడిని అడిగిన ప్రశ్నపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. 

SCs query to rape accused on marrying girl was based on judicial records ksp
Author
New Delhi, First Published Mar 4, 2021, 2:39 PM IST

బాలికపై అత్యాచారం కేసులో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం నిందితుడిని అడిగిన ప్రశ్నపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్గాలు వివరణ ఇచ్చాయి.

అత్యాచారం జరిగిన సమయంలో ఆ బాలిక బంధువులకు నిందితుడు రాసిచ్చిన పత్రాల ఆధారంగానే నిందితుడిని ఆ ప్రశ్న వేసినట్లు తెలిపాయి. తనపై కేసు పెట్టకుండా వుంటే బాలికకు వివాహ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ అతను పత్రం రాసిచ్చాడని, ఆ పత్రాన్ని చదివిన ధర్మాసనం వివాహం చేసుకోవడం ఇష్టమేనా అని ప్రశ్నించిందని పేర్కొందని తెలిపాయి.

ఆ పత్రాన్ని చూస్తు విచారణ ప్రారంభించిన ధర్మాసనం తొలుత ఆ ప్రశ్న వేసిందని వివరించాయి సుప్రీంకోర్టు వర్గాలు. ముంబైకి చెందిన ప్రభుత్వోద్యోగి మోహిత్ సుభాష్ చవాన్ స్కూల్లో చదువుకుంటున్న బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు.

పదే పదే ఆమెను రేప్ చేయడమే కాక, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పెట్రోల్ పోసి తగులబెడతానని, యాసిడ్ పోసి ముఖం కాల్చేస్తానని బెదిరించాడు. ఈ కేసులో కిందికోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. బాంబే హైకోర్టు ఆ బెయిల్‌ను కొట్టేసింది.

దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఆ కేసును విచారించిన అత్యున్నత ధర్మాసనం .. నువ్వు ఆ బాలికను పెళ్లి చేసుకుంటావా..? చేసుకుంటానంటే మేం నీకు సాయపడతాం. లేదంటే నువ్వు జైలుకెళ్లాల్సి వస్తుంది.

నీ ఉద్యోగం పోతోంది. నువ్వు ఆమెను వశపరచుకుని అత్యాచారం చేశావ్. ఆలోచించుకో, పెళ్లి చేసుకో.. మేం నిన్ను బలవంతం చేయడం లేదు అని రేపిస్ట్‌తో అన్నారు సీజే బొబ్డే. ఆ రేపిస్ట్‌కు నెల రోజుల గడువిచ్చి.. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని సీజే సారథ్యంలోని బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఆ రేపిస్ట్‌కు ఇదివరకే పెళ్లయిందనే విషయాన్ని అతని తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కోర్టు ఆ ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. బాధితురాలిని పెళ్లి  చేసుకుంటావా అని సుప్రీంకోర్టు ధర్మాసనం రేపిస్ట్‌ను అడగటం దారుణమని మహిళా సంఘాల కార్యకర్తలు, సామాజిక ప్రముఖులు తీవ్రంగా నిరసించారు.

పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, హింసించిన వ్యక్తి అదే బాలికను పెళ్లి చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమే పరోక్షంగా చెప్పడమంటే అత్యాచారాన్ని సమర్ధించినట్లే భావించాలని.. దీనిని ఖండిస్తున్నామన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే రాజీనామా చేయాలంటూ దాదాపు నాలుగు వేల మంది సామాజిక, మహిళా ప్రముఖులు డిమాండ్ చేశారు. అంటే ఒక అమ్మాయిని తీవ్రంగా రేప్ చేసి ఆ తర్వాత వివాహం చేసుకుంటే పర్వాలేదా..? పెళ్లయిన వ్యక్తి ఇలా అత్యాచారాలకు పాల్పడటాన్ని సమర్ధిస్తారా అంటూ పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై హింస, లైంగిక వేధింపుల కేసులను విచారించే విషయంలో భారత న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు హానికరంగా మారిందంటూ బహిరంగ లేఖలు విడుదల చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల భార్యలు ఆందోళనలో పాల్గొనడం ఎందుకని వారిని ఇళ్లకు పంపేయాలని జస్టిస్ బొబ్డే సూచించడం కూడా వివాదాస్పదమైంది.

పురుషులకున్న స్వాతంత్ర్యం, బాధ్యత మహిళలకు ఉండవా అంటూ సామాజిక కార్యకర్తలు ప్రశ్నించారు. సహజీవనంపై బాబ్డే చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. అంటే భర్త పెట్టే లైంగిక, భౌతిక, మానసిక హింసను చట్టబద్ధం చేయదల్చుకున్నారా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు  సోషలిస్టులు.

న్యాయమూర్తిగా సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటంటూ ప్రశ్నించారు. తాజాగా బాలికపై అత్యాచారం కేసులో సీజేఐ బాబ్డే చేసిన  వ్యాఖ్యలపై పలువురు మహిళా సంఘాల నేతలు, రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు.

ఆయన ఈ దేశ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మర్యాద అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీజే వ్యాఖ్యల్ని తప్పుబట్టిన సీపీఎం సీనియర్ నేత బృందాకారత్.. ప్రధాన న్యాయమూర్తి రేపిస్ట్‌ను అలా అడగటం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios