Heat Wave Alert: ఎండ‌లు మండుతున్నాయి. దంచికొడుతున్న ఎండ‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, బీహార్, బెంగాల్ సహా  ప‌లు రాష్ట్రాల‌కు భార‌త వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్య, తూర్పు, వాయవ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని తెలిపింది. 

IMD Weather Forecast: దేశవ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్ర‌త పెర‌గ‌డం, ఎండ‌లు మండిపోతుండటంతో ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా వడగాల్పులు బీభత్సం సృష్టిస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వాయవ్య, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఢిల్లీ నుంచి యూపీ వరకు వడగాల్పుల ప్రభావం

ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్య, తూర్పు, వాయవ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మధ్య భారతదేశం విషయానికి వస్తే, ఇది పశ్చిమ-తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గ‌ఢ్ ప్రాంతాల‌పై ప్ర‌భావం అధికంగా ఉంటుంది. తూర్పు భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఉప హిమాలయ ప్రాంతం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిషా, అండమాన్ నికోబార్ దీవులలోని కొంత భాగం ఎండ‌ల తీవ్ర‌త ఉంటే ప్రాంతాలుగా ఉన్నాయి. అలాగే, వాయవ్య భారతదేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిట్-బాల్టిస్థాన్, యూపీ, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ-తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ-తూర్పు రాజస్థాన్ ఉన్నాయి. 

ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలకు పెరిగాయి..

ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 17 వరకు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, ఏప్రిల్ 15 నుంచి బీహార్, ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 17 వరకు బీహార్ లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం మధ్య, ఉత్తర ద్వీపకల్ప భారతంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కోస్తాంధ్ర, కేరళలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.

మైదాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీలు, తీర ప్రాంతాల్లో కనీసం 37 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో కనీసం 30 డిగ్రీలు, సాధారణ ఉష్ణోగ్రత కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ ఉంటే వడగాలులు వీస్తాయ‌ని తెలిపింది. 1901లో రికార్డుల నిర్వహణ ప్రారంభమైనప్పటి నుంచి 2023లో భారత్ లో అత్యధిక ఎండ‌లు ఉన్న ఫిబ్రవరి నెల నమోదైంది. అయితే ఈ ఏడాది మార్చిలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయి. అయితే, మార్చి 2022 అత్యంత వెచ్చని సంవత్సరంగా నిలిచింది. 121 సంవత్సరాలలో మూడవ పొడి సంవత్సరంగా ఉంది. 1901 తర్వాత దేశంలో మూడో వేడిగ‌ల ఏప్రిల్ ఈ ఏడాదిగా నమోదైంది.