Asianet News TeluguAsianet News Telugu

స్కూటీని ఢీకొట్టిన కారు.. యువతి శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. న్యూ ఇయర్ రోజే ఘటన

న్యూ ఇయర్ రోజు ఉదయమే ఢిల్లీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న యువతిని కొన్ని కిలోమీటర్ల మేరకు ఆ కారు అలాగే ఈడ్చుళ్లింది. అది చూసిన కొందరు పోలీసులకు రిపోర్ట్ చేయగా.. నిందితులను పట్టుకున్నారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఈ ఘటన జరిగింది.
 

scooty hit by car and woman drags for kilometres by car on new year morning
Author
First Published Jan 1, 2023, 8:31 PM IST

న్యూఢిల్లీ: న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామునే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న యువతి కారు కింది భాగంలో చిక్కుకుపోయింది. ఆ కారు అలాగే కొన్ని కిలోమీటర్ల మేర ఆమె బాడీని ఈడ్చుళ్లింది. ఆ యువతి మరణించింది. ఢిల్లీలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఆ మారుతీ సుజుకీ బాలెనో కారులో నుంచి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాప్ ఓనర్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఈ రోజు ఉదయం ఘటన జరిగింది.

తెల్లవారుజామున 3.24 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ కాల్ వచ్చింది. మనిషి శరీరాన్ని ఓ కారు లాక్కెళ్లుతూ ఉన్నదని తెలిపారు. మరో కాల్ 4.11 గంటలకు వచ్చింది. రోడ్డుపై ఓ మహిళ బాడీ పడి ఉన్నదని ఈసారి కాల్ చేసిన వ్యక్త చెప్పారు. పికెట్‌ల దగ్గర మోహరించిన పోలీసులను వెంటనే అలర్ట్ చేశారు. ఆ వాహనం కోసం సెర్చ్ చేశారు.

Also Read: బోయినపల్లి చౌరస్తా‌లో ప్రమాదం.. రోడ్డుదాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ద దంపతుల మృతి..

కారు నెంబర్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. తమ కారు ఓ స్కూటీని ఢీ కొట్టిందని చెప్పిన నిందితులు.. ఆమెను తమ కారు కొన్ని కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చిందనే విషయం తమకు తెలియదని చెప్పారని పేర్కొన్నారు.

కాగా, ఈ ఘటన పై ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్స్ చీఫ్ స్వాతి మాలివాల్ రియాక్ట్ అయ్యారు. ఆ కారులో ఉన్నవారు మద్యం సేవించి ఉన్నారని తెలిసిందని వివరించారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఢిల్లీ పోలీసులకు సమన్లు పంపిస్తా అని తెలిపారు. మొత్తం సత్యం అంతా బయటకు రావాల్సిందే అని పేర్కొన్నారు. ఆ యువతిపై లైంగికదాడి జరిగిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. పోలీసులు ఆ ఆరోపణలను ఖండించారు.

మరణించిన యువతి అమన్ విహార్ నివాసి. తండ్రి మరణించిన కుటుంబంలో ఆమెనే పెద్ద కూతురు. తల్లితోపాటు నలుగురు అక్కా చెళ్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు కలిసి జీవిస్తున్నారు. అందులో పెద్ద కూతురే తాజా ఘటనలో మరణించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios