సికింద్రాబాద్‌లోని బోయినపల్లి చౌరస్తా‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుదాటుతున్న వృద్ద దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 

సికింద్రాబాద్‌లోని బోయినపల్లి చౌరస్తా‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుదాటుతున్న వృద్ద దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం తరలించారు. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ఇక, మృతులను నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీధర్, రాజమణిలుగా గుర్తించారు. వారు న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న వారి కొడుకును చూసేందుకు వచ్చారు. అయితే బోయినపల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతున్న సమయంలో వారిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.