అభిమన్యుడు.. తల్లి గర్భంలో నుంచి యుద్ధ విద్యను నేర్చుకోవడం నిజమని.. దానిని సైన్స్ నిరూపించదని ఆయన అన్నారు.
మహాభారతం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ అభిమన్యుడి గురించి కూడా తెలిసే ఉంటుంది. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా అడుగుపెట్టాలో తెలుసుకుంటాడు. అయితే.. ఈ పురాణగాథను చాలా మంది నమ్మరు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇవన్నీ ఎలా తెలుస్తాయి..? అని కొట్టిపారేసే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే.. అది నూటికి నూరు పాళ్లు నిజమంటున్నారు ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా.
దీనిని సైన్స్ ప్రూవ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం లక్నోలో గ్లోబల్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ షేర్ హోలర్డ్స్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సురేష్ ఖన్నా.. పలు విషయాలు చర్చించారు. అభిమన్యుడు.. తల్లి గర్భంలో నుంచి యుద్ధ విద్యను నేర్చుకోవడం నిజమని.. దానిని సైన్స్ నిరూపించదని ఆయన అన్నారు.
మహిళకు మూడో నెల వచ్చిన నాటి నుంచే ఆమె ఆలోచనలను కడుపులో బిడ్డ పసిగడుతుందని, ఆమె ఎలా ఆలోచిస్తుందో బిడ్డ కూడా అలానే ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. ఎనిమిదో నెలలో మనం మాట్లాడే మాటలను కడుపులో బిడ్డ వినగలదని ఆయన వివరించారు. దీనిని సైంటిఫికల్ గా కూడా నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన దేశం.. అభివృద్ధి సాధిస్తుందని మరో మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
