స్కూల్ గోడ కూలి విద్యార్థి మృతి.. పలువురికి గాయాలు
school wall collapse: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ గోడ కూలి ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కర్నాటకలోని రామనగర జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల గోడ కూలిన ఘటనలో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.

Karnataka residential school wall collapses: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ గోడ కూలి ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కర్నాటకలోని రామనగర జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల గోడ కూలిన ఘటనలో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నాటకలోని రామనగర జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల గోడ కూలిపోవడంతో 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. అలాగే, అతని సహవిద్యార్థులలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన విద్యార్థిని 6వ తరగతి చదువుతున్న కౌశిక్ గౌడగా గుర్తించారు.
గోడ కూలడంతో విద్యార్థి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు ప్రాణాలు బయటపడ్డారు. గాయపడిన ఇతర విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్.. "ప్రభుత్వ అధికారులతో సహా బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోవడంతో ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.