కోజికోడ్‌లో కల్లాచ్చి ప్రభుత్వ యుపి పాఠశాలో ఓ అపురూపదృశ్యం ఆవిష్కృతమయ్యింది. ఓ టీచర్ బదిలీపై వెళ్లిపోతుంటే.. విద్యార్థులంతా ఆయనను వెళ్లొద్దంటూ గుక్కపట్టి ఏడ్చే దృశ్యం అందర్నీ కదిలించింది.
కోజికోడ్ : ఓ విద్యార్థికైనా టీచర్లే ఆదర్శంగా ఉంటుంటారు. స్కూల్లో ప్రతీ విద్యార్థికి ఇష్టమైన టీచర్ ఒకరుంటారు. వారి సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, వారు చెప్పిన మాట జవదాటకపోవడం లాంటివి సహజంగా కనిపిస్తుంటాయి. అలాంటిది స్కూల్లోని పిల్లలందరి అభిమానాన్ని చూరగొడనం అనేది మామూలు విషయం కాదు. ఓ టీచర్ విషయంలో ఇలాంటి అపురూఘట్టం ఎదురయ్యింది. కోజికోడ్ లోని కక్కునిలోని వెలోమ్‌కు చెందిన పికె కుంజబ్దుల్లా టీచర్ విషయంలో అదే జరిగింది.
పికె కుంజబ్దుల్లా గత ఏడేళ్లుగా కోజికోడ్‌లో కల్లాచ్చి ప్రభుత్వ యుపి పాఠశాలో పనిచేస్తున్నాడు. తాజాగా ఆయన తన ఇంటికి సమీపంలోని ఆరంబోల్ ప్రభుత్వ యుపి పాఠశాలకు బదిలీ అయ్యాడు. ఇది ఆ స్కూల్ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకిష్టమైన టీచర్ ఇక తమ స్కూల్ కు రారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Breaking: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ.. నోటిఫికేషన్ విడుదల..
ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య బంధానికి ఇది ప్రతీక. ఈ ఘటన ఆ ఉపాధ్యాయుడు సదరు విద్యార్థుల జీవితాలపై ఎంత సానుకూల ప్రభావం చూపాడనేది తెలుస్తోంది. కుంజబ్దుల్లా స్కూలు విడిచి వెళ్లే సమయంలో విద్యార్థులందరూ అతని చుట్టూ గుమిగూడారు. వీడ్కోలు చెబుతూ.. ఏడుపు ప్రారంభించారు. తమను వదిలి వెళ్లొద్దంటూ బతిమాలారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో పిల్లలు ఏడుస్తూ తమ టీచర్‌ను పాఠశాల నుండి బయటకు వెళ్లవద్దని వేడుకుంటారు. కల్లాచి ప్రభుత్వ యు.పి. కోజికోడ్‌లోని పాఠశాలకు చెందిన ఈ వీడియోలో.. మాస్టర్ కుంజబ్దుల్లా ప్రతి విద్యార్థి కన్నీళ్లను తుడిచి, రేపు తిరిగి వస్తానని చెబుతూ ఓదార్పునిచ్చాడు. కుంజబ్దుల్లా ప్రభుత్వానికి బదిలీ అయ్యారు.
యు.పి. కోజికోడ్‌లోని పాఠశాలలో గత ఏడు సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత ఆయన ఇంటికి దగ్గరగా ఉన్న అరాంబోల్‌లోని పాఠశాలకు వెడుతున్నారు. తన అభిమాన ఉపాధ్యాయుడు తమ పాఠశాలను విడిచిపెట్టడాన్ని పిల్లలు తట్టుకోలేకపోయారు. ఈ భావోద్వేగ అనుబంధం ఆయనకు, విద్యార్థులకు మధ్య ఉన్న లోతైన అనుబంధం, ఆప్యాయత, శాశ్వతమైన ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
