అనంత పద్మనాభస్వామి దేవాలయ నిర్వహణ బాధ్యతలను రాజకుటుంబీకులకు అప్పగిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది. కొత్త కమిట ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జడ్జి ఆధ్వర్యంలో నడుస్తున్న కమిటీ చూసుకుంటుందని సుప్రీమ్ కోర్టు తెలిపింది. 

కొత్తగా ఏర్పడే కమిటీలో రాజకుటుంబీకులు ప్రముఖ పాత్రా పోషిస్తారని తెలిపింది. మిగిలిన ఒక్క నేలమాళిగ తలుపును తెరవడంపై మాత్రం సుప్రీమ్ కోర్ట్ ఏ విధమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు. 

శతాబ్దాలనాటి ఈ గుడి 2011లో నేలమాళిగలు బయటపడడంతో వార్తల్లో నిలిచింది. దాదాపుగా లక్షకోట్ల పైచిలుకు విలువచేసే ఆభరణాలు ఆ నేలమాళిగల్లో బయటపడ్డాయి.