ఉమెన్స్ హాస్టల్ లోని 40మంది బాలికలపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్ లోని ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఉమెన్స్ హాస్టల్ లోని 40మంది బాలికలపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బిహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వెంటనే దీనికి సంబంధించిన నివేదిక అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఆ బాలికల ఫోటోలను మీడియా ప్రచురించకూడదని పేర్కొంది. 

మరోవైపు షెల్టర్‌ హోంలో బాలికలపై అకృత్యాలకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్‌ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి.

చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్‌ ఇవాం వికాస్‌ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్‌ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో ఈ దారుణం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు.. ఇవి కూడా చదవండి

ఉమెన్స్ హాస్టల్ లో దారుణం.. 40మందిపై అత్యాచారం