నీట్ పీజీ-2021 కి చెందిన 1459 మెడికల్ సీట్లను భర్తీ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. ఈ విషయమై కేంద్రం ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: PG Medial కౌన్సిలింగ్ పై దాఖలైన Petition ను శుక్రవారం నాడుSupreme Court కొట్టివేసింది.1459 మెడికల్ సీట్లకు ప్రత్యేక counselling ద్వారా భర్తీ చేయాలని పిటిషన్ పై కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది.2021 ఏడాది PG మెడికల్ సీట్లను భర్తీ చేయాలన్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మిగిలిన సీట్లను భర్తీ చేస్తే ప్రస్తుత కౌన్సిలింగ్ పై ప్రభుావం పడుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ ఏడాది మే 7వ తేదీన నీట్ పీజీ 2021 లో అర్హత సాధించిన 1456 పీజీ సీట్లను భర్తీ చేయాలని వైద్యులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. విచ్చలవిడిగా కౌన్సిలింగ్ కోసం మాండమస్ రిట్ కు అర్హులు కాదన్నారు. వైద్య విద్య , ప్రజారోగ్యంపై ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
అస్ట్రా గోయెల్ నేతృత్వంలోని ఏడుగురు వైద్యుల బృందం దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది ధర్మాసనం. 8-9 రౌండ్ల కౌన్సిలింగ్ తర్వాత కూడా 40 వేల సీట్లలో 1456 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వెయ్యికి పైగా నాన్ క్లినికల్ పోస్టులున్నాయి. ప్రతి ఏటా భర్తీ కాకుండా సీట్లు మిగిలిపోతాయి., ఈ సీట్లు నాన్ క్లినికల్ లేదా టీచింగ్ పోస్టులు కావడం వల్ల డాక్టర్లు తమ కెరీర్ కు సహాయం చేయని కారణంగా ప్రాధాన్యత ఇవ్వలేదని కేంద్రం చెప్పడంతో సుప్రీంకోర్టు గురువారం నాడు ఈ అంశంపై తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఖాళీగా ఉన్న 1456 సీట్లలో వెయ్యి ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని 300 ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇంకా మొత్తం ఖాళీలలో 76 శాతం నాన్ క్లినికల్ కోర్సులలో ఉన్నాయి. నీట్-పీజీ 2022 కౌన్సిలింగ్ ప్రక్రియ జూలైలో ప్రారంభం కానుంది. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ మూసివేసినట్టుగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
also read:వైద్య విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు: 1450 మెడికల్ సీట్లు భర్తీ కాకపోవడంపై సుప్రీం సీరియస్
కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ సమయ షెడ్యూల్ కు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని బెంచ్ తన తీర్పులో పేర్కొంది. నీట్ పీజీ-2022 ఆడ్మిషన్ ప్రక్రియకు ఆటంకం లేకుండా జరిగితేనే ఇది సాధ్యమౌతుందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గత ఏడాది ప్రారంభంలో కావాల్సిన పీజీ 2021 సెషన్ ఏడాది ఆలస్యమైందని బెంచ్ పేర్కొంది. అదనపు రౌండ్ కౌన్సిలింగ్ ఉండకూడదని ప్రభుత్వం, ఎంసీసీ నిర్ణయం తీసుకోవడాన్ని ఏకపక్షమని చెప్పలేమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
మూడేళ్ల కోర్సుకు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం గడిచిన తర్వాత ఆడ్మిషన్ మంజూరు చేయవచ్చని చెప్పగలరా అని గురువారం నాడు ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైద్యులు బాగా శిక్షణ పొందాలి, విద్యతో ఎటువంటి రాజీ ఉండదు, ఎందుకంటే ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి మూడేళ్ల కంటే తక్కువ శిక్షణ ఇవ్వవద్దని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.
