దేశంలో వైద్య నిపుణుల కొరత ఉన్న సమయంలో 1450 మెడికల్ సీట్లను ఖాళీగా ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించింది.ఈ విషయమై పరిహారం కూడా వసూలు చేస్తామని కూడా ఉన్నత న్యాయ స్థానం వార్నింగ్ ఇచ్చింది. 

న్యూఢిల్లీ: దేశంలో వైద్య నిపుణుల కొరత ఉన్నప్పటికీ 1450 గ్రాడ్యుయేట్ Medical సీట్లు ఖాళీగా ఉండడంపై Supreme Court బుధవారం నాడు ఆందోళన వ్యక్తం చేసింది. మీరు వైద్య విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఈ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో 24 గంటల్లో అఫిడవిట ద్వారా చెప్పాలని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. వైద్య విద్యార్ధుల భవిష్యత్తులో ఆడుకున్నందుకు వారికి పరిహాం చెల్లించాలని కూడా కేంద్రాన్ని కోరడాన్ని కూడా కోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తులు షా, అనిరుద్ద బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక్క సీటు ఖాళీగా ఉన్నా దానిని భర్తీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్య సీటు కూడా ఖాళీగా ఉండకూడదని తేల్చి చెప్పింది. విద్యార్ధులకు Admisson ఇవ్వకపోతే జివితాలతో ఆడుకున్నందుకు మీపై నష్టపరిహాం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.

also read:వాటిని గుర్తించం.. ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

NEET-PG2021-22 విద్యా సంవత్సరానికి చివరి మాప్-ఆప్ కౌన్సిలింగ్ రౌండ్ మే 7న ముగిసింది. ఈ కౌన్సిలింగ్ తర్వాత 1465 మెడికల్ పీజీ సీట్ల కోసం ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఏడుగురు వైద్యులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది.

చాలా మంది వైద్యులు, సూపర్ స్పెషలిస్టులు అవసరమైనప్పుడు మెడికల్ సీట్లు ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం. దీని వల్ల మీరు ఏం పొందుతారని ప్రశ్నించింది. మీరు మరొక మాప్ అప్ రౌండ్ నిర్వహించి ఉండాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ విషయమై మీకు ఏమైనా బాధ్యతగా అనిపించిందా అని ఉన్నత న్యాయస్థానం అడిగింది. ప్రతిసారీ కోర్టు జోక్యం చేసుకోవాల్సిందే. కోర్టు ఆదేశం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించింది. ఇది వైద్యుల భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన అంశంగా కోర్టు అభిప్రాయపడింది. మీరు వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని చెప్పింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

కేంద్రం, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీకి కాపీని అందించాలని పిటిషనర్ ను సోమవారం నాడు కోర్టు ఆదేశించింది. అయినా కూడా కేంద్రం తరపున న్యాయ అధికారి హాజరు కాకపోవడంపై కూడా కోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఎస్టీ బల్బీర్ సింగ్ కోర్టకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదని కేంద్రం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నీట్ పీజీ 2021-22 కౌన్సిలింగ్ ఈ ేడాది ఆలస్యమైంది. మే 7న కౌన్సిలింగ్ మాత్రమే ముగిసింది.