సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నవంబర్‌లో భారత పర్యటన చేయనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేయనున్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి. 

న్యూఢిల్లీ: కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ నవంబర్‌లో భారత్ పర్యటించనున్నారు. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేయనున్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియాలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరవడానికి వెళ్లుతూ ఆయన ఒక రోజు భారత్‌లో గడపనున్నట్టు తెలిపాయి.

నవంబర్ 14వ తేదీన తెల్లవారు జామునే ఆయన భారత్‌కు వస్తారని తెలుస్తున్నది. అదే రోజు సాయంత్రం భారత్ విడిచి వెళ్లిపోతారని ఆ వర్గాలు వివరించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియా రాజకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ పర్యటన చేయనున్నట్టు తెలిపాయి. సెప్టెంబర్ నెలలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ సౌదీ కింగ్‌కు పంపినట్టు వివరించాయి.

Also Read:  మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌.. సౌదీ అరేబియా ప్రధానిగా.. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్

సౌదీ ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఈ వారంలోనే భారత్ పర్యటించారు. ఆయిల్ ఉత్పత్తులను తగ్గించే నిర్ణయాన్ని ఓపెక్ సహా ఇతర దేశాలు కలిసి తీసుకున్నాయి. ఈ తరుణంలో ఆ దేశ రాజు పర్యటనకు ముందు ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ పర్యటించారు. అదే సమయంలో ఆయన ఏకకాలంలోనే చైనా అధికారులతోనూ ఆన్‌లైన్‌లో చర్చలు చేశారు.