చెన్నై: 23 ఏళ్ల వయస్సులోనే నాలుగు పెళ్లిళ్లు చేసుకొన్న నిత్య పెళ్లి కొడుకును  తంజావూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పారిపోవడం నిత్య పెళ్లి కొడుకు సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ పెళ్లిళ్లకు పుల్‌స్టాప్‌ పడింది. 

తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని ఒక్కనాడు కీళయూరుకు చెందిన  23 ఏళ్ల సంతోష్ తిరువూరులోని ఓ బనియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం కరువిలక్కాడు గ్రామానికి చెందిన 20 ఏళ్ల సత్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు. ఆమెతో తిరువూరులో కాపురం పెట్టాడు.

నెలన్నర క్రితం సంతోష్  అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన సంతోష్ భార్య సత్య తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సంతోష్  గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే  సంతోష్ పలు పెళ్లిళ్లు చేసుకొన్న విషయాన్ని పోలీసులు  గుర్తించారు.

అయితే  తిరుపూర్‌కు చెందిన ఓ కాలేజీకి చెందిన 19 ఏళ్ల విద్యార్ధినితో సంతోష్ ప్రేమ వ్యవహరాన్ని నడిపాడు. అంతేకాదు కీళయూరులో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన సత్య పోలీసులకు కూడ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.

Also read:ప్రియుడితో రాసలీలల్లో భార్య, పక్క గదిలోనే మరో జంట: షాకైన భర్త

అయితే ఈ రెండు పెళ్లిళ్ళ కంటే ముందే మరో ఇద్దరిని కూడ సంతోష్ పెళ్లి చేసుకొన్నట్టుగా తేలింది. యువతులతో మాటలు కలిపి వారిని పెళ్లి చేసుకొనేవాడని పోలీసులు తమ విచారణలో తేల్చారు. 

కొన్ని నెలలపాటు కాపురం చేసి ఆ తర్వాత  సంతోష్ అదృశ్యమయ్యేవాడు. ఈ రకంగా నలుగురిని పెళ్లి చేసుకొని  చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేవాడు. ఎట్టకేలకు పోలీసులు  సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్‌ను  పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.