హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాల్లో భర్త ఉండడంతో తన మిత్రుడితో వివాహిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన భర్త రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్నాడు. అయితే ఈ ఇంట్లో మరో జంట కూడ రాసలీలల్లో మునిగి తేలుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.

సూర్యాపేట జిల్లా నడిగూడెం కు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు 2014లో అస్ట్రేలియా వెళ్లాడు. ఆయనకు 2010లో సూర్యాపేటకు చెందిన యువతితితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అస్ట్రేలియాలో ఉన్న సంతోష్ కు ఉద్యోగం కూడ వచ్చింది. అయితే తాను అస్ట్రేలియాకు వెళ్లే సమయంలో హైద్రాబాద్ లోని వాసవీనగర్ లో తన భార్యకు తోడుగా ఉండేందుకు తన తల్లిని వదిలి వెళ్లాడు సంతోష్.  అయితే అస్ట్రేలియాకు రావాలని పలుమార్లు భార్యను కోరినా కూడ ఆమె అస్ట్రేలియాకు వెళ్లేందుకు నిరాకరించింది.

అదే సమయంలో అస్ట్రేలియాలో సంతోష్ కు ఉద్యోగం కూడ వచ్చింది. ఏడాదికోసారి సంతోష్ హైద్రాబాద్ కు వచ్చేవాడు. కొన్ని రోజులు గడిపి అస్ట్రేలియాకు వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలోనే తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని సంతోష్ కు తెలిసింది.ఈ విషయమై భార్యను నిలదీశాడు. భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ఆమె మిత్రుడిని కూడ హెచ్చరించాడు.

అయితే అదే సమయంలో తన తల్లితో గొడవ పెట్టుకోవడంతో సంతోష్ తల్లి హైద్రాబాద్ నుండి వెళ్లిపోయింది. దీంతో సంతోష్ భార్యకు ప్రియుడితో కలిసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి.

హైద్రాబాద్‌లోని తన స్నేహితుల ద్వారా తన భార్య ఫోన్ కాల్ డేటా తెప్పించుకొన్నాడు. బోడుప్పల్ ‌లోని బానోతు శివప్రసాద్ అనే వైద్యుడితో తరచూ మాట్లాడుతున్నట్టుగా గుర్తించారు. 

ప్రియుడితో తన భార్య ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని సంతోష్ ప్లాన్ చేసుకొన్నాడు.ఈ నెల 1వ తేదీన ఎవరికీ చెప్పకుండానే సంతోష్ అస్ట్రేలియా నుండి వచ్చాడు.  తన ఇంటిపై నిఘా ఉంచాడు. తన భార్య కదలికలపై నిఘా ఉంచాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి పూట తన ఇంట్లోకి శివప్రసాద్ వచ్చిన విషయాన్ని సంతోష్ గుర్తించాడు. 

సంతోష్ వచ్చిన విషయం తెలుసుకొన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే తన ఇంటి తలుపులు కొట్టాడు. అయితే భార్య తలుపులు తీసింది. బాత్రూమ్‌లో ఆమె ప్రియుడు శివప్రసాద్ ఉన్నాడు. శివప్రసాద్ ను సంతోష్ పట్టుకొన్నాడు. 

శివ ప్రసాద్ సంతోష్ ను చంపేస్తానని బెదిరించాడు.ఇదే సమయంలో పోలీసులు వచ్చారు. ట్విస్ట్ ఏమిటంటే ఇదే ఇంట్లో సంతోష్ భార్య స్నేహితురాలైన వివాహిత ఆమె ప్రియుడు నరేష్ తో రాసలీలల్లో మునిగిపోయింది.ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. సంతోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.