PM Modi France Visit: ఫ్రాన్స్ పర్యటనలో బిబీబిజీగా ఉన్న ప్రధాని పలు ఆశ్చర్యకర బహుమతులతో ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులను, ఆ దేశ ప్రధానిని ఆశ్చర్యపర్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు శాండల్‌వుడ్ సితార్ ను బహుమతిగా అందించారు. అలాగే.. ఇతర నేతలకు పలు అత్యంత విలువైన బహుమతులను అందించారు.
PM Modi France Visit: ప్రధాని మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్యారిస్‌లో ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్నే స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇలా బిజీబిజీగా ఉన్న ప్రధాని .. పలు ఆశ్చర్యకర బహుమతులతో ఫ్రాన్స్ ప్రెసిండెంట్ దంపతులను ఆశ్చర్యపర్చారు.\
విందు అనంతరం ప్రధాని మోడీ.. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా .. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు, ఫ్రాన్స్ ప్రథమ మహిళ, ప్రెసిడెంట్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్ కు, ఫ్రెంచ్ పీఎం ఎలిసబెత్ బెర్న్ , ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌లకు భారత ప్రధాని బహుమతులను అందించారు. ఎవరికి ఏమి బహుమతి ఇచ్చారో తెలుసుకుందాం.!
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కు శాండల్ సితారా
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని చందన్ సితార్ (శాండల్ సితారా ) ను బహుమతిగా ఇచ్చారు. స్వచ్ఛమైన చందనంతో తయారు చేయబడిన సితారా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణపై సరస్వతీ దేవి చిత్రాలను, గణేశుడి ప్రతిమను రూపొందించారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా.. నెమలి లాంటి శిల్పాలతో అందంగా రూపొందించారు.
బ్రిగిట్టే మాక్రాన్‌కు 'పోచంపల్లి ఇకత్ చీర'
ప్రెసిడెంట్ మాక్రాన్ సతీమణి బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టె బహుమతిగా లభించింది. ఈ పెట్టెలో తెలంగాణలోని పోచంపల్లి పట్టణానికి చెందిన పోచంపల్లి సిల్క్ ఇకత్ చీరను బహుమతిగా అందించారు. పోచంపల్లి ఇకత్ కు కేవలం తెలంగాణలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంది గుర్తింపు ఉంది. వస్త్ర ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ చీర భారతదేశ వస్త్ర వారసత్వానికి సాక్ష్యమిది.ఇకత్ సిల్క్ సారీని ఆకర్షణీయమైన గంధపు పెట్టెలో పెట్టి అందించారు. ఈ ఇకత్ చీర హస్తకళ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింభించేలా ఉంది.
ఫ్రాన్స్ ప్రధానికి మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్..
'మార్బుల్ ఇన్లే వర్క్' అనేది సెమీ విలువైన రాళ్లను ఉపయోగించి పాలరాయిపై చేసిన అత్యంత ఆకర్షణీయమైన కళాకృతులలో ఒకటి. అధిక నాణ్యత గల పాలరాయికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని మక్రానా నగరంలో బేస్ మార్బుల్ కనుగొనబడింది. దానిపై ఉపయోగించే పాక్షిక విలువైన రాళ్లను రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుండి , భారతదేశంలోని ఇతర నగరాల నుండి సేకరించారు. మార్బుల్‌లో మాన్యువల్ ఫైన్ కటింగ్, సెమీ విలువైన రాళ్ల చెక్కడం ఉంటుంది. మొదట ఈ విలువైన రాళ్ళు కొన్ని డిజైన్లలో కత్తిరిస్తారు. ఇది అపురూప కళాఖండాన్ని ఫ్రాన్స్ ప్రధానికి అందించారు.
చందనం ఏనుగు బొమ్మ
ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు సమర్పించబడిన అలంకారమైన ఏనుగు విగ్రహం స్వచ్ఛమైన చందనంతో తయారు చేయబడింది. గంధపు చెక్కతో చేసిన ఈ విగ్రహాలు అద్భుతమైనవి. ఈ గంధపు ఏనుగు బొమ్మలకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి, ఇది జ్ఞానం, శక్తి , అదృష్టాన్ని సూచిస్తుంది. అందంగా చెక్కబడిన ఈ శిల్పాలు ప్రకృతి, సంస్కృతి, కళల మధ్య సామరస్యాన్ని సూచిస్తాయి.
ప్రధాని మోడీకి మాక్రాన్ బహుమతులు
కాగా.. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ప్రధాని మోడీకి కూడా ప్రత్యేక బహుమతులను అందించారు. 1916లో సిక్కు అధికారికి పూలను అందజేస్తున్న పారిసియన్ ఫోటో ఫ్రేమ్డ్ ఫాక్సిమైల్.. 11వ శతాబ్దానికి చెందిన చార్లెమాగ్నే చెస్‌మెన్ ప్రతిరూపాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా అందించారు.