లారెన్స్ కళ్లలో ఆనందం చూడ్డానికే సల్మాన్ ఖాన్ ను చంపాలనుకున్నా

Sampath Nehra reveals why he planned to kill Salman Khan
Highlights

హైదరాబాదులో పట్టుబడిన గ్యాంగస్టర్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి చేసిన పథకం గురించి దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు.

హైదరాబాద్‌: హైదరాబాదులో పట్టుబడిన గ్యాంగస్టర్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి చేసిన పథకం గురించి దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు. కృష్ణజింకను చంపిన సల్మాన్ ఖాన్ ను చంపితే తప్ప కృష్ణజింక ఆత్మకు శాంతి చేకూరదని ఆ బిష్ణోయ్ తెగ గ్యాంగస్టర్ లారెన్స్ నిర్ణయించుకున్నాడు. లారెన్స్ కళ్లలో ఆనందం చూడడానికే తాను సల్లూ భాయ్ ని చంపాలని అనుకున్నట్లు సంపత్ నెహ్రా చెప్పాడు.

సల్మాన్ ను చంపేందుకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకునే పనిలో ఉండగా హైదరాబాదులో సంపత్ నెహ్రూ పోలీసులకు చిక్కాడు. అయితే సల్మాన్‌ హత్యకు కుట్రపన్నింది బిష్ణోయ్‌ తెగకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ కాగా, దాన్ని అమలు చేసేందుకు పూనుకుంది సంపత్ నెహ్రా 
 
ఇరవై  ఏళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌ కోసం జోధ్‌పూర్‌ వెళ్లిన సల్మాన్‌ సహ నటులతో కలిసి కృష్ణజింకను వేటాడి చంపారనే కేసులో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. అయితే కృష్ణజింకను హత్యచేసినందుకు సల్మాన్‌ను చంపుతామని బిష్ణోయ్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ ప్రకటించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. 

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అయిన లారెన్స్‌ పలు కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్నాడు. సంపత్ పది హత్య కేసుల్లో నిందితుడు. రెండు చేతుల్లోని తుపాకులతో ఒకేసారి లక్ష్యాన్ని గురిపెట్టి కాల్చడంలో సంపత్‌ అందె వేసిన చేయి అని చెబుతారు. 

ఓ మిత్రుడి ప్రోద్బలంతో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో చేరాడు. గురువు లారెన్స్‌ కళ్లలో ఆనందం చూసేందుకు సల్మాన్‌ను హత్యచేసేందుకు సంపత్ అంగీకరించాడు. అంతర్జాతీయ సెల్‌ నంబరును వాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా అనుచర గణాన్ని పెంచుకున్నాడు. ఓసారి తన అనుచరుడిని విడిపించేందుకు పోలీసులపైనే తుపాకీ ఎక్కుపెట్టినట్లు కూడా చెబుతారు. 

 సల్మాన్‌ హత్యకు తానొక్కడినే సుపారీ తీసుకున్నానని, జనవరిలో ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెట్‌ వద్ద రెండు రోజులు రెక్కీ కూడా నిర్వహించానని సంపత్‌ విచారణలో చెప్పాడు. సల్మాన్‌ఖాన్‌ బాల్కనీలో పచార్లు చేసేటప్పుడు షూట్‌ చేసేందుకు స్కెచ్‌ కూడా వేశానని చెప్పాడు.

loader