Asianet News TeluguAsianet News Telugu

యూపీ స్థానిక ఎన్నికలు: బీజేపీ విజయంపై సైనా ట్వీట్.. 'సర్కారీ షట్లర్' అంటూ విపక్షాల ట్రోలింగ్

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  దాంతో యూపీ బీజేపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే, బీజేపీ విజయం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ విమర్శలకు కారణమైంది.

saina nehwal appreciates bjp win in up panchayat elections ksp
Author
new delhi, First Published Jul 4, 2021, 9:27 PM IST

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  దాంతో యూపీ బీజేపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే, బీజేపీ విజయం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ విమర్శలకు కారణమైంది. జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

'సర్కారీ షట్లర్' (ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి) అంటూ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఆమెను విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడంలో బీజేపీ నైపుణ్యాన్ని ఈ 'సర్కారీ షట్లర్' గుర్తించారని సెటైర్లు వేశారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండడంపై ఓటర్లు 'డ్రాప్ షాట్' (బ్యాడ్మింటన్ లో ఓ రకమైన షాట్) ప్రయోగించాల్సిన అవసరం ఉందని జయంత్ చౌదరి చురకలు వేశారు.

Also Read:యోగి ఆదిత్యనాథ్‌కు ఊరట: అఖిలేశ్‌ ఆశలు గల్లంతు.. యూపీ లోకల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

అటు తమిళనాడు కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ డాక్టర్ అస్లామ్ బాషా కూడా సైనా ట్వీట్ పై స్పందించారు. "సెక్యులరిజం మీ అభిమానుల మధ్య విభేదాలకు కారణమైంది... ఆడటాన్ని ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. సైనా నెహ్వాల్ గతేడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios