New Delhi: నైరుతి ఢిల్లీలోని నజఫ్ గఢ్ లోని ఓ దాబాలో ఫ్రీజర్ లో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైన కేసులో పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన‌ సాహిల్, మృతురాలు నిక్కీల‌కు 2020లో ఒక‌ గుడిలో వివాహం జరిగింద‌ని పోలీసులు గుర్తించారు. అలాగే, వివాహ ధృవీకరణ పత్రాల‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. 

Sahil Gehlot-Nikki Yadav-Najafgarh murder case: నజఫ్ గఢ్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెలికి తీస్తుండగానే మరో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన‌ సాహిల్, మృతురాలు నిక్కీల‌కు 2020లో ఒక‌ గుడిలో వివాహం జరిగింద‌ని పోలీసులు గుర్తించారు. అలాగే, వివాహ ధృవీకరణ పత్రాల‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కుటుంబ సభ్యుల సాయంతోనే ఈ హత్య జరిగిందని సమాచారం.

2020 లో గుడిలో సాహిల్-నిక్కీల వివాహం

దేశ‌రాజ‌ధానిలోని నైరుతి ఢిల్లీలోని నజఫ్ గఢ్ లోని ఓ దాబాలో ఫ్రీజర్ లో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైన కేసులో పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన సాహిల్ గెహ్లాట్ 2020లో గ్రేటర్ నోయిడాలోని ఆర్యసమాజ్ ఆలయంలో నిక్కీ యాదవ్ ను వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం. రిమాండ్ సమయంలో సాహిల్, నిక్కీల వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్ ఫిబ్రవరి 10న తన ప్రియురాలు నిక్కీని హ‌త్య చేశాడు. ఆమె మృతదేహాన్ని నైరుతి ఢిల్లీలోని తన దాబాలో రిఫ్రిజిరేటర్ లో ఉంచాడు. ఆ తర్వాత అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. అంత‌కుముందు పోలీసులు దాబాలో మృత‌దేహాం అభ్య‌మైన కేసుగా న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌ర‌ప‌గా ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. నిందితుడు సాహిల్ ను ఇంకా విచారిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

హత్య కుట్రలో కుటుంబ సభ్యులు 

ఈ హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను గురించి పోలీసు వ‌ర్గాలు పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. సాహిల్ కుటుంబం వారి వివాహంపై అసంతృప్తితో ఉండటంతో, వారు 2022 డిసెంబర్ లో అతని వివాహాన్ని ఫిక్స్ చేశారు. సాహిల్ అప్పటికే నిక్కీని వివాహం చేసుకున్నట్లు పెండ్లికూతురు కుటుంబానికి చెప్ప‌కుండా దాచిపెట్టారు. ఈ కుట్రకు సహకరించారనే ఆరోపణలపై అతని తండ్రిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, సాహిల్ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి నిక్కీ హత్యకు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారిని విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాహిల్ తండ్రి వీరేందర్ సింగ్, అతని ఇద్దరు సోదరులు, ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. నిక్కీ యాదవ్ హ‌త్య‌కు స‌హక‌రించాడే తెలుసుకున్న అధికారులు వీరేంద్ర సింగ్ పై ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు.

సాహిల్ తండ్రి వీరేందర్ సింగ్ అరెస్ట్.. 

సాహిల్ తండ్రి వీరేందర్ సింగ్ కు తన కుమారుడు నిక్కీని హత్య చేశాడని తెలుసునని పోలీసులు గుర్తించడంతో అతన్ని అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ 120బీ (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సాహిల్ గెహ్లాట్ స్నేహితుడు, బంధువు, సోదరుడిని అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. నేరం జరిగిన నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 14న గహ్లోత్ పోలీసుల అదుపులో నేరాన్ని అంగీకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 10న తన పెళ్లి గురించి నిక్కీకి తెలిసిందనీ, దాన్ని తాను రహస్యంగా ఉంచానని సాహిల్ విచారణలో పోలీసులకు చెప్పాడు. దంపతుల మధ్య వాగ్వాదం జరగడంతో సాహిల్ తన కారులో ఉంచిన డేటా కేబుల్ తో నిక్కీని హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత ఫోన్ లో ఉన్న త‌న‌కు సంబంధించిన‌ డేటాను డిలీట్ చేసి, మృత‌దేహాన్ని తన దాబాకు తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్ లో దాచాడు. నేరానికి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఫిబ్రవరి 14న సాహిల్ ను కస్టడీలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.