సారాంశం

నకిలీ సాధువులను గుర్తించడానికి తమిళనాడు అధికారులు వారి వేలి ముద్రలను సేకరిస్తున్నది. అరణాచలేశ్వర్ ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు సాధువులు ఆటంకాలు సృష్టిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వారి ఫింగర్ ప్రింట్లు సేకరించి వారి బ్యాక్‌గ్రౌండ్, వారి నేర చరితను పరిశీలించే వీలు చిక్కుతుంది.
 

చెన్నై: నకిలీ సాధువులను గుర్తించడానికి తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తిరువన్నమలై జిల్లా గిరివాలం దారిలో సాధువుల డేటాను సేకరిస్తున్నది. వారి ఫింగర్ ప్రింట్లను సేకరించే డ్రైవ్ ప్రారంభించింది. తద్వార నకిలీ సాధువులకు చెక్ పెట్టడం వీలవుతుందని భావిస్తున్నది.

అరుణాచలేశ్వర్ ఆలయానికి వెళ్లే భక్తులు గిరివాలాన్ని పాటిస్తారు. కొండపైకి 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లుతారు. ఈ గిరివాలాన్ని పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు అనుసరిస్తారు.

Also Read: ఓ క్రిమినల్‌ను అరెస్ట్ చేశారు.. చంద్రబాబు వ్యవహారం పై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

అయితే.. ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులకు నకిలీ సాధువులు ఆటంకాలు కలిగిస్తున్నారని అనేక ఫిర్యాదులు పోలీసులకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆ నకిలీ సాధువులను గుర్తించే పనిలో పడ్డారు. సాధువుల ఫింగర్ ప్రింట్లు సేకరిస్తున్నారు. తద్వార వారి బ్యాక్‌గ్రౌండ్ పరిశీలిం చే వీలు చిక్కుతుంది. వారికే మైనా నేర చరిత్ర ఉన్నదా? అని పరిశీలిస్తున్నారు.