రైతుల నిరసనలను సాకుగా చూపి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న విదేశీ ప్రముఖులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో సహా భారతీయ ప్రముఖులు చురకలంటించిన సంగతి తెలిసిందే.

భారతదేశం గురించి భారతీయులకు తెలుసునని.. బయటి శక్తులకు ఈ విషయంలో జోక్యం అనవసరమంటూ సచిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై కేరళ కాంగ్రెస్ భగ్గుమంది. సచిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగింది. అక్కడితో ఆగకుండా ఆయన కటౌట్‌పై కాంగ్రెస్ నేతలు నల్ల నూనెను పోశారు. 

కాగా, రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఉద్యమానికి అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు సెలబ్రెటీలు తమ మనసులోని మాటను చెబుతున్నారు.

ఈ క్రమంలో కొందరి ట్వీట్లు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనమంతా ఓ దేశంగా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలుగకూడదని హెచ్చరించారు. బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలని, మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కారాదని స్పష్టం చేశారు. భారత దేశం గురించి భారతీయులకు తెలుసునని, భారత దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని సచిన్ పేర్కొన్నారు. 

Also Read:భారతదేశం గురించి భారతీయులకు తెలుసు: పాప్ సింగర్ రిహానాకు సచిన్ కౌంటర్

మరోవైపు ఐదేళ్ల కింద‌ట ష‌ర‌పోవా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. స‌చిన్ గురించి అడ‌గ్గా అత‌డు ఎవ‌రో నాకు తెలియ‌దు అని చెప్పింది. ఇది విని మాస్ట‌ర్ అభిమానుల‌కు మండిపోయింది.

మా క్రికెట్ గాడ్‌ను అంత మాట అంటావా అంటూ ఆమె ఫేస్‌బుక్ వాల్‌లో ష‌ర‌పోవాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వీళ్లలో కేర‌ళ అభిమానులే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ క్రికెట్ గాడే రైతుల‌కు కాకుండా ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వ‌డం వీళ్ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

దీంతో ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ష‌ర‌పోవా వాల్‌లోకి వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. నువ్వు చెప్పింది క‌రెక్టే. మేమే నిన్ను అపార్థం చేసుకున్నాం. స‌చిన్ నువ్వు తెలుసుకోవాల్సినంత గొప్పోడేమీ కాదు.

అత‌డు గొప్ప ప్లేయ‌ర్‌గా మాకు తెలుసు కానీ. ఓ వ్య‌క్తిగా తెలియ‌దు అని అభిమానులు మ‌ల‌యాళంలో క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. ఇవేంటో అర్థం కాక త‌ల ప‌ట్టుకున్న ష‌ర‌పోవా.. ఇది ఏ ఏడాదో మ‌ర‌చిపోయారా అని ప్ర‌శ్నించింది