సచిన్ పైలెట్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. మంగళవారం నాడు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పదవి నుండి సచిన్ పైలెట్ ను తొలగించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశానికి  సచిన్ సహా ఆయన వర్గీయులు గైర్హాజరయ్యారు.


సోమవారం నాడు సీఎం ఆశోక్ గెహ్లాట్ నివాసంలో జరిగిన సమావేశానికి  సచిన్ పైలెట్  సహా  ఆయన వర్గీయులు ఎవరూ కూడ హాజరు కాలేదు. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశానికి కూడ సచిన్ సహా ఆయన వర్గీయులు హాజరు కాలేదు. ఈ సమావేశానికి హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించినా కూడ సచిన్ పైలెట్ పట్టించుకోలేదు.

సచిన్ సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ సమావేశం మంగళవారం నాడు తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన కొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది.

also read:రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం: సీఎం పదవే ముద్దు, సచిన్ గ్రూప్‌పై చర్యలకు సీఎల్పీ తీర్మానం

డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రి పదవి నుండి కూడ సచిన్ పైలెట్ ను తప్పించింది కాంగ్రెస్ పార్టీ. సచిన్ పైలెట్ కు మద్దతుగా ఉన్న మరో ఇద్దరు మంత్రులను కూడ మంత్రి పదవి నుండి తప్పించింది.

రాజస్థాన్ పీసీసీ చీఫ్ పోస్టు నుండి సచిన్ పైలెట్ ను తప్పించింది. గోవింద్ సింగ్ కు రాజస్థాన్ పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. సచిన్ పైలెట్ కు తలుపులు తెరిచి ఉంచినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.