కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సచిన్, లక్ష్మణ్

First Published 29, Jul 2018, 11:07 AM IST
sachin and vvs Laxman takesh ktr green challenge
Highlights

తెలంగాణ హరితహరం కార్యక్రమానికి ప్రచారం కల్పించేందుకు ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా తాను మొక్కను నాటి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు సవాల్ విసిరారు

తెలంగాణ హరితహరం కార్యక్రమానికి ప్రచారం కల్పించేందుకు ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా తాను మొక్కను నాటి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను వీరిద్దరూ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.

కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్ ‘‘ మీరు గ్రీన్‌ఛాలెంజ్‌కు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు కేటీఆర్.. ఈ ఛాలెంజ్‌ను  స్వీకరిస్తున్నానన్నారు. అనంతరం అభిమానులను ఉద్ధేశిస్తూ.. భూమిపై పచ్చదనం నింపే బాధ్యత మన చేతుల్లోనే ఉంది.. మీరు కూడా మొక్కలు నాటుతారని ఆశిస్తున్నా’’నంటూ ట్వీట్ చేశారు.

ఇక లక్ష్మణ్ విషయానికొస్తే.. ‘‘పచ్చదనం అనే ప్రేమ విత్తనం ఎప్పటికి మరణించదు.. నేను దానిమ్మ, వాటర్ యాపిల్, లక్ష్మణ ఫలం మొక్కలు నాటాను..మంచి నిర్ణయమని కేటీఆర్‌ను అభినందించారు.. అనంతరం వీరేంద్ర సెహ్వాగ్, పీవీ సింధూ, మిథాలీ రాజ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

 

loader