ఆపరేషన్‌ గంగలో భాగంగా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి 200 మందిని, హంగెరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి 220 మందిని సీ 17 విమానాలు భారత్‌కు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విద్యార్ధులకు స్వాగతం పలికారు.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) నేపథ్యంలో భారతీయుల తరలింపు జరుగుతోంది. పరిస్ధితులు అనుకూలించకపోయినా.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా (indian evacuation ) కేంద్ర ప్రభుత్వం భారతీయులను తరలిస్తోంది. ఉక్రెయిన్ తమ దేశ గగనతలాన్ని మూసివేయడంతో భారతీయ పౌరులను పశ్చిమ సరిహద్దులకు పంపి... అక్కడి నుంచి హంగేరి, పోలాండ్, రోమేనియాల మీదుగా స్వదేశానికి తరలిస్తున్నారు అధికారులు. గత కొన్నిరోజుల నుంచి విమానాల సంఖ్యను కూడా పెంచింది కేంద్రం. ఢిల్లీ, ముంబైలకు చేరుకుంటున్న విద్యార్ధులను కేంద్ర మంత్రులు రిసీవ్ చేసుకుంటున్నారు. 

ఆపరేషన్‌ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి 200 మందితో ఒక విమానం, హంగెరీ రాజదాని బుడాపెస్ట్‌ నుంచి 220 మందితో మరో సీ-17 విమానం ఢిల్లీలోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్‌ భట్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ (rajeev chandrasekhar) స్వాగతం పలికారు. కాగా, మరో 300 మందితో కూడిన మూడు సీ-17 విమానాలు గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకుంటాయని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

గ‌తవారం రోజులుగా.. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆ దేశంలోని ప‌లు న‌గరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్ సహా చాలా నగరాలు ధ్వంస‌మయ్యాయి. యుద్ధం విరమించాలని.. అమాయకుల ప్రాణాలు పోతున్నాయని..ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్న రష్యా మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ త‌రుణంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల‌ను సురక్షిత ప్రాంతాల‌కు స్వ‌దేశానికి తిరిగి ర‌ప్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఉక్రెయిన్ వదిలిపెట్టి రావాలంటూ భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఇప్పటి వరకు 17,000 మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దును దాటినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 

సరిహద్దు దాటిన భారతీయులను వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో భారతీయుల పరిస్థితిపై కొన్ని వివరాలు తెలియజేశారు. MEA అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ఆప‌రేష‌న్ గంగా ( Op Ganga ) కార్య‌క్ర‌మంలో భాగంగా బుకారెస్ట్ నుండి బుధ‌వారం రాత్రికి ఢిల్లీకి వ‌స్తుందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో 15 విమానాలు షెడ్యూల్ చేశామ‌ని ప్ర‌క‌టించారు. 

సరిహద్దులకు సమీపంలోని పట్టణాల్లో ఆశ్రయం, ఆహారం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆపరేషన్ గంగా కింద విమానాలు కూడా బాగా పెరిగాయనీ.. గత 24 గంటల్లో, ఆరు విమానాలు భారతదేశంలో ల్యాండ్ అయ్యాయ‌నీ, దీనితో భారతదేశంలో ల్యాండ్ అయిన మొత్తం విమానాల సంఖ్య 15కి చేరుకుందనీ. ఉక్రెయిన్ నుంచి భార‌త్ కు వచ్చిన వారి సంఖ్య 3,352కి చేరింద‌ని తెలిపారు. 

Scroll to load tweet…