రష్యా దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులు, బాంబుల వర్షం కురిపిస్తుంది. యుద్దం ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న, ఆంక్షలు విధిస్తున్న రష్యా వెనక్కి తగ్గడం లేదు. 

రష్యా దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులు, బాంబుల వర్షం కురిపిస్తుంది. యుద్దం ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న, ఆంక్షలు విధిస్తున్న రష్యా వెనక్కి తగ్గడం లేదు. తమపై ఆంక్షలు విధించే దేశాలకు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీచేస్తున్నారు. మరోవైపు యుద్దం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరాలంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా భారత్‌ సహా పలు దేశాలను కోరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో‌నే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టుగా ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. జెలెన్ స్కీ‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించనున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుతో పాటు, ఇతర అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ఇక, దిమిత్రో కులేబా తన టెలివిజన్ ప్రసంగంలో.. ఉక్రెయిన్‌లో విదేశీ పౌరులను కలిగి ఉన్న దేశాల సానుభూతిని గెలుచుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోందని అన్నారు. విదేశీ విద్యార్థుల సమస్యను రష్యా మానిప్యులేట్ చేయడం ఆపివేయాలని.. అప్పుడే వారందరూ సురక్షితంగా ఖాళీ చేయబడతారని తెలిపారు. యుద్దం ఆపాలని, పౌరులను విడిచిపెట్టడానికి అనుమతించాలని రష్యాకు విజ్ఞప్తి చేయాలని భారతదేశం, చైనా, నైజీరియా ప్రభుత్వాలను కోరుతున్నట్టుగా చెప్పారు. 

.ఉక్రేనియన్ వ్యవసాయ ఉత్పత్తుల అతిపెద్ద వినియోగదారులలో భారతదేశం ఒకటి మరియు ఈ యుద్ధం కొనసాగితే, కొత్త పంటలకు విత్తనాలు వేయడం మాకు కష్టమవుతుంది. కాబట్టి, ప్రపంచ మరియు భారతీయ ఆహార భద్రత పరంగా కూడా ఈ యుద్ధాన్ని ఆపడం ఉత్తమం అని పేర్కొన్నారు.

ఇక, కొద్ది రోజుల ముందే జెలెన్ స్కీ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాను. రష్యా దురాక్రమణను తిప్పికొట్టే ఉక్రెయిన్ గమనాన్ని తెలియజేశాను’ అని జెలెన్ స్కీ చెప్పారు. 

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగా పేరుతో ఫిబ్రవరి 26న మిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ కింద ఇప్పటివరకు 76 విమానాలలో 15,920 మంది పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చింది. కొన్ని ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని భారత అధికారులు.. రష్యా, ఉక్రెయిన్ దేశాలను కోరుతున్న సంగతి తెలిసిందే.