న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ ఏపీ భవన్  సమీపంలో బుధవారం నాడు మధ్యాహ్నం కారులో మంటలు వ్యాపించాయి.  ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణీకులు కారు నుండి దిగిపోయారు.

బుధవారం నాడు మధ్యాహ్నం నడుస్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణీకులు వెంటనే కారు నుండి దిగిపోయారు. కారులో మంటలను సకాలలో గుర్తించిన  ప్రయాణీకులు కారు నుండి దిగిపోయారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి బాధితులు  సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Also read:కారులో చేలరేగిన మంటలు: బయటపడిన ఇద్దరు

అయితే కారులో మంటలు ఎందుకు వ్యాపించాయనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో నడుస్తున్న కార్లు తరచూ మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కార్లలో మంటలు వ్యాపించడానికి పలు రకాల కారణాలను చెబుతున్నారు.

కొన్ని కార్లలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాప్తి చెందుతున్నట్టుగా మెకానిక్‌లు అంటున్నారు.  కారల్లో మంటలను సకాలంలో గుర్తించకపోతే కార్లలో ప్రయాణించే వారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు.