హైదరాబాద్: హైద్రాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో  శుక్రవారం నాడు ఉదయం కారులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. ఈ ఘటన నుండి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

ఇద్దరు వ్యక్తులు మైలార్‌దేవ్‌పల్లి వద్ద కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటు చేసుకొంది. కారులో మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరు కారు నుండి   బయటకు దిగారు. 

కారు నుండి  వెంటనే ఆ ఇద్దరు బయటకు దిగారు.  కారు నుండి బయటకు రాగానే  కారు మొత్తం మంటలతో దగ్దమైంది.  కారులో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై ఆరా తీస్తున్నారు.

గతంలో కూడ హైద్రాబాద్‌ పట్టణంలో కారులో మంటలు వ్యాపించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. కారులో షార్ట్‌ సర్క్యూట్  కారణంగా మంటలు వ్యాపించాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహలో కారులో మంటలు వ్యాపించిన ఘటనలో సజీవ దహనమైన ఘటనలు కూడ చోటు చేసుకొన్న సందర్భాలు కూడ చోటు చేసుకొన్నాయి. ఇవాళ జరిగిన ఘటనలో  మాత్రం ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.