‘కట్టింగ్ సౌత్’’కు కౌంటర్‌గా ఆర్ఎస్ఎస్ ‘బ్రిడ్జింగ్ సౌత్’ .. నార్త్ టు సౌత్ ఇండియా ఒక్కటే : నందకుమార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) డిసెంబర్ 12న కేరళ , చెన్నైలలో రాజకీయ ప్రేరేపిత సమూహం నిర్వహిస్తోన్న'కటింగ్ సౌత్' కార్యక్రమానికి కౌంటర్‌గా 'బ్రిడ్జింగ్ సౌత్' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనుంది. డిసెంబర్ 12న ఢిల్లీలో బ్రిడ్జింగ్ సౌత్ ప్రారంభోత్సవం వుంటుందని నందకుమార్ చెప్పారు. 

 RSS to launch campaign 'Bridging South' to counter 'Cutting South' on Dec 12: J Nandakumar ksp

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) డిసెంబర్ 12న కేరళ , చెన్నైలలో రాజకీయ ప్రేరేపిత సమూహం నిర్వహిస్తోన్న'కటింగ్ సౌత్' కార్యక్రమానికి కౌంటర్‌గా 'బ్రిడ్జింగ్ సౌత్' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రజా ప్రవాహ జాతీయ కన్వీనర్ , ఆర్ఎస్ఎస్ సభ్యుడు, అఖిల భారతీయ కార్యకారిణి జె నందకుమార్ ఈ మేరకు వివరాలు తెలియజేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 12న ఢిల్లీలో బ్రిడ్జింగ్ సౌత్ ప్రారంభోత్సవం వుంటుందని నందకుమార్ చెప్పారు. 

కటింగ్ సౌత్ అనే సంఘటన వెనుక వున్న భావజాలాన్ని ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారత్ ఒకటే.. అందుకే వేదాలలోనూ మహాసముద్రం వరకు భారత్ ఒక్కటే అని చెప్పబడిందని నందకుమార్ గుర్తుచేశారు. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా భారత్ ఒక్కటేనని ఆయన వెల్లడించారు. కానీ ఇటీవల కొన్ని అంశాలు విభజన మనస్తత్వంతో భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నించాయని నందకుమార్ ఆరోపించారు. రాజకీయ పార్టీల పేర్లు చెప్పకుండానే.. ‘‘భారత్‌ను విభజించాలి’’ అనే సందేశంపై కొన్ని సంస్థలు ప్రచారం ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. 

కొన్ని రాజకీయ పార్టీలు, మరికొందరు మేధావులుగా చెప్పుకునేవారు 'కటింగ్ సౌత్' అంటూ ప్రచారం ప్రారంభించారని నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'భారత్‌ను విభజించాలి' అనే సందేశాన్ని సామాన్యులకు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. 'కటింగ్ సౌత్' వంటి అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు?" ఆయన ప్రశ్నించారు. కేరళలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఆహ్వానం అందుకున్న ప్రతినిధి కేవలం దక్షిణాదికే పరిమితమయ్యారని .. దీని అర్ధం ఏంటి అని నందకుమార్ నిలదీశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు కటింగ్ సౌత్ వెనుక తప్పుడు ప్రచారం వుందని చెబుతున్నారని ఆయన తెలిపారు. 

ఇది ఖచ్చితంగా సామాన్యులకు విషపూరితమైన, విభజన సందేశాన్ని ఇవ్వడానికేనని నందకుమార్ చెప్పారు. సహజంగా ప్రజలు మీడియా నుంచి ఇలాంటి సందేశాన్ని విన్నప్పుడు సోకాల్డ్ గ్లోబల్ సౌత్ గురించి ఆలోచించరని తెలిపారు. ఢిల్లీ దక్షిణాదిని విస్మరిస్తోందని, కేరళ-తమిళనాడు-చెన్నై, మరికొందరు ఆదాయంలో ఎక్కువ సహకారం అందిస్తున్నారని కానీ తక్కువ అభివృద్ధిని పొందుతున్నారని ఈ 'కటింగ్ సౌత్' వెనుక తప్పుడు ప్రచారం ఉందని జె నందకుమార్ అన్నారు. సహజంగా రాజకీయంగా పెద్దగా అక్షరాస్యత లేని సామాన్యుడు పెద్ద మీడియా కవర్ చేసింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇంజెక్ట్ చేయబడే అలాంటి భావజాలాన్ని ఎదుర్కోవడానికి మేధోపరమైన ప్రతిఘటన చేయాలని నందకుమార్ కోరారు. 

'బ్రిడ్జింగ్ సౌత్' కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. త్వరలో ఇదే తరహాలో ఈశాన్య ప్రాంతంలోనూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నందకుమార్ ప్రకటించారు. దక్షిణాదిలోని పలు నగరాల్లో బ్రిడ్జింగ్ సౌత్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని. ఈ తర్వాత 'bridging north-east'లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios