ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని సంస్థలనూ నడుపుతోందని కాంగ్రెస్ నాయకుడు, రాహుల్ గాంధీ అన్నారు. ఆ సంస్థ అన్నింటినీ స్వాధీనం చేసుకుందని అన్నారు. అన్న సంస్థల్లోనూ ఆర్ఎస్ఎస్ కు చెందిన సభ్యులు ఉన్నారని అన్నారు.
జమ్ముకాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి లద్దాఖ్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ (ఆరెస్సెస్)పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశంలోని ప్రతీ సంస్థలో తన వ్యక్తులను ఉంచుతోందని అన్నారు. అధికార బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అని అన్నారు. అందుకే అది అన్నింటినీ నడుపుతోందని ఆరోపించారు.
దారుణం.. వేగంగా వచ్చి, బైక్ ను ఢీకొట్టి మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో వైరల్
‘‘కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరిని అడిగినా వారు తాము మంత్రిత్వ శాఖలను నడపడం లేదని చెబురు. వాస్తవానికి ఆరెస్సెస్ నియమించిన వారే ఈ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారు. వారే ప్రతీ విషయాన్ని సూచిస్తున్నారు’’ అని ఆరోపించారు. అనంతరం రాహుల్ గాంధీ రోజు లేహ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యువతతో ముచ్చటించారు.
విమానంలో వృద్ధుడి అసభ్యకరమైన చేష్టలు.. ఎయిర్ హోస్టెస్ లోదుస్తులు కనిపించేలా వీడియో రికార్డ్..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 1947లో భారత్ కు స్వాతంత్య్రం వచ్చిందని, భారత్ లో స్వాతంత్య్ర సాధనే రాజ్యాంగమని అన్నారు. ‘‘రాజ్యాంగ దార్శనికతకు తోడ్పడే సంస్థలను ఏర్పాటు చేయడమే రాజ్యాంగాన్ని ఆచరణలోకి తెచ్చింది. బీజేపీ, ఆరెస్సెస్ లు తమ సొంత వ్యక్తులను సంస్థాగత నిర్మాణంలో కీలక పదవుల్లో ఉంచుతున్నాయి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
పెద్దపల్లిలో మధ్యప్రదేశ్ బాలిక మృతి కేసులో ట్విస్ట్.. అదేంటంటే ?
కాగా.. అంతకు ముందు లేహ్ లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ను రాహుల్ గాంధీ వీక్షించారు. కాగా.. శనివారం శనివారం పాంగాంగ్ సరస్సు సమీపంలోకి బైక్ పై వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసింది. అలాగే కొన్ని ఫొటోలను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా పోస్టు చేశారు. ‘‘నా తండ్రి పాంగోంగ్ సరస్సుకు వెళ్లే మార్గంలో.. ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి ’’ అని ఆ ఫొటోలను క్యాప్షన్ పెట్టారు.
