Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల్లో పంచ పరివర్తన్ కార్యక్రమంపై చర్చ

ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల్లో పంచ పరివర్తన్ కార్యక్రమంపై చర్చించనున్నారు. ఈ దసరాతో ఆర్ఎస్ఎస్ నూరేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇందుకోసం ఈ నెలలోనే ప్రతినిధులు సమావేశమై కీలక అంశాలపై చర్చ జరపనున్నారు.
 

rss centenary celebrations this year vijayadashami, meeting in nagpur kms
Author
First Published Mar 13, 2024, 7:08 PM IST

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 ఏళ్లుగా సామాజిక సంస్థగా క్రియాశీలకంగా పని చేస్తూనే ఉన్నది. ఈ ఏడాది విజయదశమితో ఈ సంస్థ నూరేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల కోసం ప్రణాళికలపై చర్చించనుంది. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో ఈ సమావేశాన్ని ఆర్ఎస్ఎస్ నిర్వహించనుంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది పూర్తి చేసుకుంటున్న తరుణంలో శాఖలను ఒక లక్షకు పెంచాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఏబీపీ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఈ రోజు వెల్లడించారు.

ఈ సమావేశంలో రాముడికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై ఓ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మాననీయ సరకార్యవాహ్‌ను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో పంచ పరివర్తన్ కార్యక్రమంపై లోతుగా చర్చిస్తారు. సామాజిక పరివర్తన కోసం ఐదు కీలక అంశాలు ఇందులో ఉంటాయి. సామాజిక సామరస్యత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ్, స్వ అనే పదం, పౌర బాధ్యతలు ఇందులో ఐదు అంశాలు.

Also Read: AI: ఏడాదిలో మనిషి మేధస్సును ఏఐ అధిగమిస్తుంది: ఎలన్ మస్క్

ఈ ప్రతినిధుల సభలో సంఘ్ శిక్షా వర్గ్‌పైనా చర్చించి కర్రిక్యులాన్ని సవరిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios