AI: ఏడాదిలో మనిషి మేధస్సును ఏఐ అధిగమిస్తుంది: ఎలన్ మస్క్
వచ్చే ఏడాది వ్యక్తి కంటే ఏఐ స్మార్ట్‌గా ఉంటుందని ఎలన్ మస్క్ అంచనా వేశారు. 2029 కల్లా మొత్తం మనుషుల కంబైన్డ్ మేధస్సు కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివికల్లదవుతుందని ట్వీట్ చేశారు.
Elon Musk: టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆ టెక్నాలజీని వినియోగించుకునే లోపే అంతకుమించిన ఆవిష్కరణ మరేదో జరుగుతూనే ఉన్నది. ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన టెక్నాలజీ కృత్రిమ మేధస్సు. ఓపెన్ ఏఐ, జెనరేటివ్ ఏఐలు సమస్త ప్రపంచంపై ప్రభావం వేస్తున్నది. అది ప్రొఫెషనల్, పర్సనల్ అంశాలనూ అనూహ్యంగా ప్రభావితం చేస్తున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఆశ్చర్యాలతోపాటు అనేక ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ టెక్నాలజీపై ముచ్చటపడుతూనే.. ఇది మానవ మేధస్సును అధిగమిస్తుందా? అనే సంశయాలు బయల్దేరాయి. కొందరైతే.. మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనుషులనే శత్రువులుగా భావిస్తే పరిస్థితి ఏమిటనీ చర్చలు చేశారు. అయితే.. ఏఐ ఏనాడైనా మనిషి మేధస్సును అధిగమించగలదా? మనిషిని ఏఐ రిప్లేస్ చేయగలదా? అనే అంశాలపై చర్చ ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నది. అయితే.. నేడు టెక్ సామ్రాజ్యంలో సాహసికుడిగా, రోల్ మోడల్‌గా చాలా మంది భావించే ఎలన్ మస్క్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ! రేపు ప్రకటిస్తాం: చంద్రబాబు నాయుడు
వచ్చే ఏడాది ఏ వ్యక్తి కంటేనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివినైదిగా ఉండే అవకాశమున్నదని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. 2029 కల్లా సమస్త మానవాళి మేధస్సు(కలిపి చూస్తే) కంటే కూడా స్మార్టర్ అయి ఉండొచ్చని ట్వీట్ చేశారు.