దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో జనం వైరస్ మరింత పెరిగేందుకు కారణమవుతున్నారు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో జనం వైరస్ మరింత పెరిగేందుకు కారణమవుతున్నారు. నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే పరిసరాలు, రైళ్లలో మాస్క్‌ ధరించకపోతే నేరంగా పరిగణిస్తూ.. రూ. 500 వరకు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. 

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం అత్యవసరమని రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం గతేడాది మే 11న భారత రైల్వే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులందరూ మాస్క్‌లు విధిగా ధరించాలని సూచించింది. అయితే ఇప్పుడు ఈ మాస్క్‌ల వినియోగాన్ని 2012 చట్టం కిందకు తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

Also Read:కరోనా సెకండ్ వేవ్ : లేత గులాబీ రంగు కళ్లు.. జీర్ణాశయ సమస్యలు... !!

ఈ చట్టం ప్రకారం.. రైల్వే పరిసరాల్లో ఉమ్మడం లాంటివి చేసిన వారికి భారీ జరిమానా విధించొచ్చు. ఈ ఆదేశాలు ఆరు నెలల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.

కాగా, దేశంలో గడిచిన కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా మూడో రోజు 2 లక్షలకు పైగా కేసులు, 1000కి పైగా మరణాలు నమోదయ్యాయి.