ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి, అలా ఉంటే ఆఫీసుకి రావొద్దు: ఉద్యోగులకు కేంద్రం ఆదేశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ లో సేఫ్ అనే స్టేటస్ చూపిన ఉద్యోగులే విధులకు రావాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ లో సేఫ్ అనే స్టేటస్ చూపిన ఉద్యోగులే విధులకు రావాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
విధులకు హాజరయ్యేందుకు బయలుదేరే ముందు ఆరోగ్య సేతు యాప్ లో సేఫ్, లో రిస్క్ అనే స్టేటస్ ఉంటేనే ఆఫీస్ కు రావాలని సూచించింది.ఒకవేళ యాప్ లో హై రిస్క్ అని చూపితే వెంటనే 14 రోజులపాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
also read:ఇప్పట్లో ప్రజా రవాణా ప్రారంభించే అవకాశం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈ మేరకు అన్ని విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు కూడ కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరింది.
ఆరోగ్య సేతు యాప్ ను కేంద్రం తయారు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి దూరంగా ఉండేందుకు ఈ యాప్ దోహాదపడుతోంది.కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలు ఈ నియమాలను పాటించాలని కోరింది.
జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు ఇప్పటికే ఈ తరహా నిబంధనలను పాటిస్తున్నారు. ప్రతి కార్యాలయంలో వన్ థర్డ్ ఉద్యోగులు విధులకు రావాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.