Asianet News TeluguAsianet News Telugu

లంచం తీసుకొంటూ నలుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగుల అరెస్ట్: ఒకరి ఇంట్లో రూ. 3 కోట్లు సీజ్ చేసిన సీబీఐ

ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో నుండి రూ. 3 కోట్ల నగదుతో పాటు బంగారాన్ని సీబీఐ అధికారులు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో స్వాధీనం చేసుకొన్నారు. 
 

RS. 3 Crore, Counting Machine Seized From Government Clerk In Bribery Case lns
Author
Bhopal, First Published May 30, 2021, 10:18 AM IST

భోపాల్:ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో నుండి రూ. 3 కోట్ల నగదుతో పాటు బంగారాన్ని సీబీఐ అధికారులు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో స్వాధీనం చేసుకొన్నారు. క్లర్క్ గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ఇంట్లో నగుదను లెక్కించే మెషీన్ ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎఫ్సీఐలో  క్లర్క్ గా పనిచేస్తున్న  కిషోర మీనా నివాసంలో సీబీఐ అధికారులు  రూ. 2.17 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఎఫ్‌సీఐలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగుల ఇంటిపై దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. శనివారం నాడు ఉదయం నలుగురు ఎఫ్‌సీఐ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.  అరెస్ట్ తర్వాత సీబీఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకొన్నారు. బీరువాలో పెద్ద ఎత్తున  నగదును స్వాధీనం చేసుకొన్నారు. 

గురుగ్రామ్‌కి చెందిన సెక్యూరిటీ సంస్థ ఎఫ్‌సీఐ ఉద్యోగులపై సీబీఐకి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకొన్నారు.కెప్టెన్ కపూర్ సన్స్ సంస్థ కు  సెక్యూరిటీ గార్డుల కేటాయింపు కోసం రూ. రూ.11.30 లక్షల చొప్పున చెల్లించేందుకు ఎప్‌సీఐ టెండర్ కేటాయించింది.అయితే ప్రతి నెల ఈ బిల్లు ఇవ్వడానికి కనీసంగా రూ. 1.30 లక్షలను  ఎప్‌సీఐ అకౌంట్స్ మేనేజర్లు డిమాండ్ చేస్తున్నారని కపూర్ సన్స్ సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 

ఎఫ్‌సీఐ ఉద్యోగులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు దాడి చేసిన నలుగురు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. లంచం చెల్లించే వ్యక్తుల కచ్చితమైన వివరాలతో కూడ డైరీని కూడ స్వాధీనం చేసుకొన్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్ హరీష్ హినోనియా,  మేనేజర్ అరుణ్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ మేనేజర్ కిషోర్ మీనా, మోహన్ పరాటేలను భోపాల్  లోని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఈ ఏడాది జూన్ రెండో తేదీ వరకు నిందితులను సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.వేర్వేరు ఎన్వలాప్ కవర్లలో నగదును సీబీఐ అధికారులు గుర్తించారు. డైరీలో దొరికిన ఆధారాలతో ఎన్వలాప్ కవర్లపై  లంచం ఇచ్చిన వ్యక్తుల పేర్లు, తేదీలు కూడ గుర్తించినట్టుగా సీబీఐ అధికారులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios