Tax raids: వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు.. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు !
Tax raids : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. గురువారం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు రూ. 150 కోట్ల నగదును ఐటీ అధికారులు లెక్కించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే, ఆ వ్యాపారికి సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తో సంబంధాలు ఉండటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tax raids : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. గురువారం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు రూ. 150 కోట్ల నగదును ఐటీ అధికారులు లెక్కించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే, ఆ వ్యాపారితో సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తో సంబంధాలు ఉండటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుడు, గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్ జైన్.. ఇంటితో పాటు ఆయన వ్యాపారాలకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు గురువారంనుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈదాడుల్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. అధికారులు విస్తుపోయేలా మొత్తం 150 కోట్ల రూపాయలకు పైగా నగదు కట్టలు బయటపడ్డాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే అఖిలేష్ యాదవ్ తో సంబంధాలు కలిగివున్న పియూష్ జైన్ ఇంట్లో ఇంత భారీ మొత్తంలో గుట్టల కొద్ది నోట్ల కట్టలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Coronavirus: 18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా
అధికారుల వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన ప్రముఖ పాన్ మసాలా తయారీదారుడు, ట్రాన్స్ పోర్టు వ్యాపారవేత్త పీయూష్ జైన్ ఇండ్లు, కార్యాలయాలపై గురు, శుక్రవారాల్లో జీఎస్టీ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అయితే, అధికారులు సైతం విస్తుపోయేలా 150 కోట్ల రూపాయలకు పైగా నగదు కట్టలు బయట పడ్డాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, ముంబైల్లోని పీయూష్ కార్యాలయాల్లోనూ, అనుచరుల ఇళ్లలోనూ అధికారులు ఈదాడులు జరిపారు. అధికారులు సోదాలు నిర్వహించిన మొత్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో నోట్ల కట్టలు లభించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. భారీగా నోట్ల కట్టలు బయటపడటంతో బ్యాంకు సిబ్బంది, నోట్ల లెక్కింపు యంత్రాలన పదుల సంఖ్యలో అధికారులు తీసుకెళ్లారని తెలిసింది. ఇప్పటివరకు లెక్కించిన వివరాల ప్రకారం.. రూ.150 కోట్ల దాటింది. ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. శనివారం మధ్యాహ్నం వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగించున్నట్టు తెలుస్తోంది.
Also Read: ఎన్నికలకు బ్రేక్.. యూపీలో రాష్ట్రపతి పాలన?.. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు !
జరగబోయే యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పీయూష్ జైన్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కు నమ్మిన బంటుగా గుర్తింపు ఉంది. జైన్ సంస్థ తయారు చేసిన “సమాజ్ వాదీ అత్తరు”కు ఉత్తరప్రదేశ్ లో ప్రచారకర్తగా సమాజ్ వాదీ పార్టీ కొనసాగింది. దీంతో జైన్ పన్నులు ఎగ్గొట్టి అక్రమంగా కూడబెట్టుకున్న విషయం.. సమాజ్ వాదీ పార్టీకి ప్రతికూలంగా మారే పరిస్థితులను సృష్టించిందని చెప్పాలి. పీయూష్ జైన్, అనేక తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి.. పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. రూ.50 వేలు అంతకన్నా తక్కువగా ఇన్వాయిస్ మొత్తాన్ని చూపెట్టి టాక్స్ ఎగ్గొట్టినట్లు పేర్కొన్నారు. ఇక ఈదాడులపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర… ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, సమాజ్ వాదీ పార్టీ అసలు రంగు బయటపడిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదంతా ప్రజల డబ్బు అనీ, సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యక్తులను మరింత ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు.
Also Read: రూ.3 వేల కోసం బండరాళ్లతో కొట్టిచంపారు.. దేశరాజధానిలో దారుణ ఘటన