ఆ వ్యక్తి ఆచూకీ చెబితే రూ. 10 లక్షలిస్తాం - ఎన్ఐఏ ప్రకటన.. ఇంతకీ ఎవరతను ?

రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టిన వ్యక్తిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. నిందితుడి ఫొటో ఇప్పటికే విడుదల చేసిన ఆ దర్యాప్తు సంస్థ.. అతడికి సంబంధించిన వివరాలను తెలియజేసిన వారికి రూ.10 లక్షల రివార్డును ఇస్తామని ప్రకటించింది.

Rs 10 lakh reward for providing details of accused who planted bomb at Rameswaram cafe in Bengaluru: NIA..ISR

బెంగళూరు కుందలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి నిందితులను పట్టుకునేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించడంతో ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. 

ముచ్చటగా మూడో సారి మోడీయే ప్రధాని.. ఎన్డీఏ కూటమికి 378 సీట్లు - ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్

కేఫ్ లో బాంబు పెట్టిన నిందితులను పట్టుకునేందుకు ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అనుమానిత బాంబర్ ఫొటోను ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా నిందితుడి అరెస్టుకు దారితీసే కీలక సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.

ఓటింగ్ సమయంలో వేలికి పూసే సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా ? దాని ప్రత్యేకతలేంటంటే ?

ఈ కేసులో ప్రజల సహకారాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఎన్ఐఏ ఈ ప్రకటన చేసింది. అయితే నిందితులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించే వారి గుర్తింపును అత్యంత గోప్యంగా ఉంచుతామని కేంద్ర దర్యాప్తు సంస్థ హామీ ఇచ్చింది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, కేసుకు త్వరగా, సులభంగా చేధించడానికి ఎన్ఐఏ ఈ ప్రయత్నం చేస్తోంది. 

నిందితులకు సంబంధించిన ఏ సమాచారం తెలిసినా.. ముందుకు వచ్చి తమ దర్యాప్తునకు సహకరించాలని ఎన్ఐఏ కోరింది. 08029510900 లేదా 8904241100 నెంబర్లకు కాల్ చేసి సాధారణ పౌరులెవరైనా అధికారులను సంప్రదించవచ్చిన పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios