Asianet News TeluguAsianet News Telugu

అదర్ పూనావాలా ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి రూ. కోటి చీటింగ్.. ఏడుగురి అరెస్ట్..

సీరమ్ కంపెనీ సీఈవో పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 

Rs 1 crore cheating in Serum Institute of India,  7 arrested, maharashtra
Author
First Published Nov 26, 2022, 6:49 AM IST

మహారాష్ట్ర : సైబర్ నేరగాళ్లు బరి తెగించారు. ఏకంగా ఓ ప్రముఖ కంపెనీ సీఈవో ఫొటోను డీపీగా పెట్టుకుని మరీ భారీ మోసానికి పాల్పడ్డారు. దీనికోసం పుణేకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ ల తయారీ కంపెనీ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను వాడుకున్నారు. ఆ కంపెనీ సీఈఓ అదర్ పునావాలా ఫోటోతో భారీ మోసానికి తెరలేపారు. ఈ చీటింగ్ కేసులో మోసానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే... 

2 నెలల క్రితం నిందితులు ఓ వాట్సప్ అకౌంట్ కు అదర్ పునావాలా ఫోటోను డీపీగా పెట్టారు. ఆ నెంబరుతో సీరం కంపెనీకి చెందిన ఓ డైరెక్టర్ ను సంప్రదించారు. అతని దగ్గరి నుంచి కోటి రూపాయలు కాజేశారు. అయితే మొదట ఈ విషయం వారికి తెలియలేదు. అడిగింది సీఈవోనే అనుకున్నారు. అయితే తరువాత మోసం సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

గుజ‌రాత్ లో సీట్లు, ఓట్ల ప‌రంగా బీజేపీ అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంది.. : కేంద్ర మంత్రి అమిత్ షా

వీరి తెలిపిన ప్రకారం.. సెప్టెంబర్ రెండో వారంలో బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఓ కేసు నమోదయ్యింది. అదర్ పునావాలా ఫొటోను సదరు నిందితుడు తన వాట్స్అప్ అకౌంట్ కు డీపీగా పెట్టుకున్నారు. దీంతో సీరమ్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైనా  సతీష్ దేశ్ పాండేతో చాటింగ్ చేశాడు. తనతో ఛాటింగ్ చేస్తుంది అదర్ పూనావాలానే అని సతీష్ దేశ్ పాండే అనుకున్నాడు. కాసేపటి తరువాత తనకు డబ్బులు కావాలని, అర్జంట్ అవసరం ఉన్నాయని మెసేజ్ లు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అప్పటికి కూడా సతీష్ దేశ్ పాండేకు అనుమానం రాలేదు. అదర్ పునావాలానే డబ్బులు అడుగుతున్నాడని అనుకున్నాడు.  

ఈ మేరకు నిందితుడు చెప్పినట్టుగా.. వాట్సాప్ చాటింగ్ లో పేర్కొన్నట్టుగా.. అతను అడిగిన 8 బ్యాంక్ అకౌంట్ లలోకి రూ.1.01 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తరువాత విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీనిమీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు బ్యాంకు అకౌంట్లు ఎనిమిది వేరువేరు వ్యక్తులకు చెందినవిగా గుర్తించారు. ఈ ఎనిమిది మందిలో ఏడుగురిని వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ఎనిమిదో వ్యక్తి.. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు జోన్-2 డిప్యూటీ పోలీసు కమిషనర్ స్మార్థన పాటిల్ వెల్లడించారు.

అంతేకాదు, ఈ ఎనిమిది అకౌంట్ ల నుంచి 40 వేర్వేరు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. వీటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పదమూడు లక్షల రూపాయలు వీరినుంచి జప్తు చేశామని తెలిపారు. నిందితులందరూ మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, యూపీలకు చెందినవారేనని తెలిపారు. వీరంతా బీఎస్సీ గ్రాడ్యుయేషన్, బీటెక్ చదువుకున్నారని పోలీసులు వివరించారు. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఓ కమర్షియల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తాము గుర్తించారని తెలిపారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను  సీరం సంస్థ ఉత్పత్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios