Asianet News TeluguAsianet News Telugu

గుజ‌రాత్ లో సీట్లు, ఓట్ల ప‌రంగా బీజేపీ అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంది.. : కేంద్ర మంత్రి అమిత్ షా

Narmada: సీట్లు, ఓట్ల పరంగా గుజరాత్ లో బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వూల్లో  2017 కంటే ఈసారి ఎన్నికల్లో గెలవడం సులభమా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. ఏ ఎన్నికలనూ తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు.
 

BJP will break all records in terms of seats and votes in Gujarat: Union Minister Amit Shah
Author
First Published Nov 26, 2022, 2:58 AM IST

Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల క్ర‌మంలో ఎలాగైనా మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవ‌డానికి త‌మ‌ముందున్న ఏ అవ‌కాశాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) వ‌దులుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన అగ్ర‌నాయ‌కులు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సైతం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపుకోసం విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. సీట్లు, ఓట్ల పరంగా గుజరాత్ లో బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వూల్లో  2017 కంటే ఈసారి ఎన్నికల్లో గెలవడం సులభమా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. ఏ ఎన్నికలనూ తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు.

శుక్రవారం నర్మదా జిల్లా రాజ్‌పిప్లాలో రోడ్ షో సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ‌రో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని అన్నారు. ఇదివ‌ర‌కు ఉన్న అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంద‌ని చెప్పారు. 2017 కంటే ఈసారి ఎన్నికల్లో గెలవడం సులభమా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. ఏ ఎన్నికలనూ తేలిగ్గా తీసుకోవడం లేద‌న్నారు. “మేము ప్రతి ఎన్నికలను సవాలుగా పరిగణిస్తాము. ప్రజల నుండి ఎక్కువ ఓట్లను పొందాలనుకుంటున్నాము. ఈసారి సీట్లు, ఓట్ల పరంగా అన్ని రికార్డులను బద్దలు కొడతామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని అమిత్ షా అన్నారు.

అలాగే, తిరుగుబాటుదారులకు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "రెబల్స్, ఇత‌ర అభ్యర్థులకు కమలం గుర్తు ఉన్నంత వరకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు పార్టీతో ఉంటారు.. అభ్యర్థితో కాదు" అని ఆయన అన్నారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై బీజేపీ పని చేసిందని చెప్పారు. 'అభివృద్ధి, శాంతిభద్రతల విషయంలో బీజేపీ చాలా మంచి పని చేసింది. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తాం. ప్రజల మద్దతు మాకు ఉంది' అని ఆయన అన్నారు.

అంత‌కుముందు ర్యాలీలో ప్ర‌సంగించిన అమిత్ షా.. కాంగ్రెస్, ఆప్ ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. సెంట్రల్ గుజరాత్‌లోని నాడియాద్‌లో తన ప్రచారాన్ని ప్రారంభించిన షా.. అక్కడ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. సుదీర్ఘ‌కాలం పాటు కాంగ్రెస్ పాల‌న‌, తమకు లభించిన సుదీర్ఘ మద్దతు కారణంగా నేరస్తులు హింసకు పాల్పడటం అలవాటు చేసుకున్నందున గుజరాత్ అల్లర్లను చూసిందని ఆయన పేర్కొన్నారు. అయితే,  ఆ అలవాటు మరిచిపోయి 2022 వరకు ఎవరూ అల్లరి పేరు పెట్టుకోలేదని అలాంటి పాఠం నేర్పారు. మతపరమైన అల్లర్లను బలంగా ఎదుర్కోవడం ద్వారా గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేని శాంతిని నెలకొల్పిందని షా అన్నారు.

ఈ దేశాన్ని, గుజరాత్‌ను కూడా కాంగ్రెస్ ఎన్నో ఏళ్లుగా పరిపాలించిందని షా అన్నారు. 'కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో అభివృద్ధి కనిపించలేదు. మతపరమైన అల్లర్లు జరిగేవి. వర్గాల మధ్య, సోదరుల మధ్య చీలికలు వచ్చేలా పనిచేశాయి, ఈ అల్లర్లలో ఎప్పుడూ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఆర్టికల్ 370ని అలాగే ఉంచుకుంది. కాశ్మీర్‌లో తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి.. వారి ఓటు బ్యాంకు ఎవరో తెలుసా?" అని షా ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios