Rozgar Mela: రోజ్‌గార్ మేళాలో భాగంగా యువతకు 70 వేల జాబ్ లెటర్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంద‌జేశారు. దేశవ్యాప్తంగా శ‌నివారం 44 చోట్ల రోజ్ గార్ మేళా జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ద్వారా పేదలు, అసంఘటిత రంగాన్ని ఆదుకోవడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు వారి కృషి, నిబద్ధతను ప్రధాని ప్రశంసించారు.

Prime Minister Narendra Modi: రోజ్‌గార్ మేళాలో భాగంగా యువతకు 70 వేల జాబ్ లెటర్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంద‌జేశారు. దేశవ్యాప్తంగా శ‌నివారం 44 చోట్ల రోజ్ గార్ మేళా జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ద్వారా పేదలు, అసంఘటిత రంగాన్ని ఆదుకోవడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు వారి కృషి, నిబద్ధతను ప్రధాని ప్రశంసించారు.

వివ‌రాల్లోకెళ్తే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి 70 వేలకు పైగా నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వారినిద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఈ దేశ ప్రజలు తీర్మానించార‌నీ, వచ్చే 25 ఏళ్లు భారత్ కు చాలా కీలకమని అన్నారు. కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రతి నిపుణుడు చెబుతున్నారు. అంటే ఉపాధి అవకాశాలు, పౌరుల తలసరి ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసానికి గురైందని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం బలంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటనీ, కానీ తొమ్మిదేళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ''బ్యాంకింగ్‌ రంగం అత్యంత పటిష్టంగా ఉన్న దేశాల్లో నేడు భారత్‌ ఒకటి. కానీ 9 ఏళ్ల కిందటి పరిస్థితి ఇది కాదు.. గత ప్రభుత్వ హయాంలో మన బ్యాంకింగ్‌ రంగం భారీ విధ్వంసానికి గురైంది. ఈరోజు డిజిటల్‌ లావాదేవీలు చేయగలుగుతున్నాం కానీ 9 ఏళ్ల క్రితం ఫోన్‌ బ్యాంకింగ్‌ 140 కోట్ల మందికి లేదు. ఈ కుటుంబానికి దగ్గరగా ఉండేవారు వేల కోట్ల రూపాయల రుణాలు అందించలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు ఉన్నాయి’’ అని ప్రధాని మోడీ అన్నారు.

దేశవ్యాప్తంగా 44 చోట్ల రోజ్ గార్ మేళా జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్తవారు రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, తపాలా శాఖ, పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో ప్రభుత్వంలో చేరనున్నారు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాన మంత్రి హామీని నెరవేర్చే దిశగా రోజ్ గార్ మేళా ఒక ముందడుగుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. రోజ్ గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనీ, యువతకు వారి సాధికారత, జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను అందిస్తుందని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.