మాల్యా కోసం జైలు ముస్తాబు.. కొత్తగా రంగులు, టైల్స్

First Published 30, Aug 2018, 2:48 PM IST
Royal enclosures for vijay mallya in arthur road jail
Highlights

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కోసం ముంబై ఆర్థర్ రోడ్‌లోని బ్యారక్ నెం. 12ను ముస్తాబు చేస్తున్నారు. 

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కోసం ముంబై ఆర్థర్ రోడ్‌లోని బ్యారక్ నెం. 12ను ముస్తాబు చేస్తున్నారు. ఇటీవల తనను భారత్‌కు అప్పగించే పిటిషన్‌పై జరిగిన విచారణలో ఇండియాలో జైళ్లు బాగోవని ఆరోపించడంతో.. యూకే కోర్టు మాల్యాను ఉంచబోయే జైలులోని మౌలిక సదుపాయాలు తెలిపేలా వీడియోను తీసి చూపించాలని సీబీఐని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తొలుత ఆగస్టు 10వ తేదీన.... ఆగస్టు 13న.. చివరిగా ఆగస్టు 16న మూడోసారి వీడియో తీసి కోర్టుకు పంపించారు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు చర్యలు వేగవంతం కావడంతో ఆర్థర్‌ రోడ్ జైలు అధికారులు బ్యారక్ నెం.12కు కొత్త హంగులు అద్దుతున్నారు.

కొత్త టైల్స్, గోడలకు పెయింటింగ్‌లు, వెస్ట్రన్ బాత్‌రూమ్ ఏర్పాటు చేశారు. దీనిపై జైలు అధికారులు మాట్లాడుతూ.. ఆర్థర్ రోడ్ జైలులోని రెండు గదుల్లో మార్పులు చేశామని.. ఒక దాంట్లో మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఉంటుండగా.. మరో దాన్ని మాల్యా కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

loader