Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలువురు మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దులకు పంపించింది. ఈ క్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రూమేనియా కు పంపించింది కేంద్రం. ఉక్రెయిన్‌లో సుమారు 1,500 మంది పౌరులు మిగిలి ఉన్నారని, వారి కూడా సురక్షితంగా తరలించడానికి, రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే.. ఈ కార్యక్రమాన్ని మరింత సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలువురు మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు పంపించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో పంపించింది కేంద్రం. రొమేనియాకు చేరుకున్న ఆయన స్వయంగా విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో సుమారు 1,500 మంది పౌరులు మిగిలి ఉన్నారని, వారి కూడా సురక్షితంగా తరలించడానికి.. రష్యా అధికారులతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. రొమేనియన్ అధికారులు భారత విద్యార్థులకు, ప్రజలకు సహాయం చేస్తున్నారనీ, మిగిలిన పౌరులను సురక్షితంగా సరిహద్దు ప్రాంతాలకు తరలించడానికి రష్యా అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
యుద్దభూమిలో విద్యార్థులు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారనీ, రెండు రోజుల్లో తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సింధియా అన్నారు, పౌరులను ఖాళీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
తరలింపు ప్రక్రియలో నాలుగు భాగాలను విభజించినట్టు తెలియజేశారు. మొదట.. ప్రజలను ఉక్రెయిన్ సరిహద్దుకు తీసుకువెళ్లండి. రెండవది.. సరిహద్దును సులభతరంగా క్రాసింగ్ చేయించడం.
మూడవది.. రొమేనియా/మోల్డోవా సరిహద్దు దాటిన వారిని బుకారెస్ట్‌కు తరలించడం. నాల్గవది.. బుకారెస్ట్ నుండి భారత్ కు ఎయిర్ లిప్ట్ చేయడం.
గత మూడు రోజులలో..రొమేనియా సరిహద్దుకు సమీపంలోని సుసెవా విమానాశ్రయానికి దగ్గర ఓ స్థావరాన్ని ఏర్పాటు చేశారని, ఇది భారతీయ విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన స్థావరమని తెలిపారు. విద్యార్థులు ఇకపై బుకారెస్ట్‌కు బస్సులో 7.5 గంటలు ప్రయాణించాల్సిన అవసరం లేదని తెలిపారు. మొత్తం 15,000 మంది విద్యార్థుల్లో 7,000 మంది విద్యార్థులను మార్చి 1కి ముందు సరిహద్దు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారని, ఉక్రెయిన్‌లో దాదాపు 1,500 మంది విద్యార్థులు మిగిలి ఉన్నారని చెప్పారు.
భారతీయ విద్యార్థుల తరలింపు సమయంలో మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు, బకారెస్ట్ మేయర్‌కు మధ్య జరిగిన వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంపై క్లారీటి ఇస్తూ.. రొమేనియన్ మేయర్ తో ఎటువంటి విభేదాలు లేవని, విద్యార్థుల తరలింపులో సమస్య ఉందని,
ఆ విషయంలోనే వారితో వాగ్వాదానికి దిగినట్టు తెలిపారు. విద్యార్థులను తరలింపును మరింత వేగవంతం చేశామని, 15 గంటల్లో విద్యార్థులందరూ విమానంలో ఉండేలా చూస్తున్నామని సింధియా చెప్పారు.
ప్రతి బిడ్డను ఇంటికి తిరిగి తీసుకురావడానికి.. చాలా కష్టపడుతున్నట్టు ఆయన తెలిపారు. సింధియాతో పాటు, కేంద్రమంత్రులు హర్దీప్ పూరి, కిరెన్ రిజిజు, వికె సిగ్ ఉక్రెయిన్ పొరుగు దేశాలలో విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు. యుద్ధ బాధిత దేశం నుండి భారతీయులను తరలించడానికి కృషి చేస్తున్నారు. మంత్రి సింధియా రొమేనియా ప్రభుత్వానికి, రాయబార కార్యాలయానికి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
