బైక్ పై యువ జంట రొమాన్స్.. ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోతూ.. పోలీసులు ఏం చేశారంటే? (వీడియో)

యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ జంట బైక్ పై రొమాన్స్ చేస్తూ వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఆ జిల్లా పోలీసులు తాజాగా స్పందించారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. ఆ జంటకు భారీ జరిమానా విధించారు.

Romance of a young couple on a bike.. hugging each other.. What did the police do?..ISR

ఓ యువ జంట రోడ్డుపై వింత చేష్టలకు పాల్పడింది. నలుగురు చూస్తున్నారనే స్పృహ లేకుండా బైక్ పైనే రొమాన్స్ చేసుకున్నారు. కదులుతున్న బైక్ పైనే ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయారు. ప్రియుడు బైక్ నడుపుతూ ఉంటే.. ఆ ప్రియురాలి అతడిని కౌగిలిలో బంధించింది. ఇది యూపీలోని హాపూర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన పోలీసులు ఏం చేశారంటే ? 

ఇంటి దగ్గర వదిలిపెడతానంటే బావ బైక్ ఎక్కిన మరదలు.. ఆమెతో మందు తాగించి, మరో నలుగురితో కలిసి...

రోడ్డుపై కొందరి ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగడమే కాక.. కొన్ని సార్లు ప్రమాదాలకు కారణమవుతుంది. అందుకే అలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. మోటారు వాహనాల చట్టం కూడా ఇలాంటి ఘటనలు ఉపేక్షించదు. తాజాగా రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన ఓ జంటకు పోలీసులు భారీ జరిమానా విధించారు.

యూపీలోని హాపూర్ లో ఓ జంట బైక్ పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్లింది. యువకుడి బైక్ నడుపుతుండగా.. ప్రేయసి అతడిని కౌగిలిలో బంధించింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని అతడికి ఎదురుగా కూర్చొంది. ప్రియుడు బైక్ నడుపుతుండగా అతడి కౌగిలిలో ఆమె ఒదిగిపోయింది. బైక్ అలా రోడ్డుపై వెళ్తునే ఉంది. ఈ జంట చేష్టలు కొన్ని కిలో మీటర్ల వరకు ఇలాగే సాగింది. దీనిని అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియో తీశారు. తరువాత దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ జంట తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.

బాబోయ్.. గుండెపోటుతో మరణించిన వ్యక్తి మృతదేహంపై కూర్చుని అఘోరాల పూజలు..

సింభౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ వీడియోపై స్పందించిన హాపూర్ పోలీసులు ఆ జంటకు భారీ జరిమానా విధించారు. బైకర్ కు మోటారు వాహనాల చట్టం కింద రూ.8 వేల జరిమానా విధించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. గతంలోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిపైనా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios