ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కొడుకు రోహిత్ శేఖర్ తివారి హత్య కేసు పలు మలపులు తిరుగుతోంది. తొలుత రోహిత్ ది సహజ మరణం అని అందరూ భావించారు. ఎప్పుడైతే పోస్టు మార్టం రిపోర్టు వచ్చిందో.. అతనిది సాధారణ మృతి కాదు.. హత్య అని తేలింది. 

అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోయినప్పటికీ..దిండుతో ఊపిరాడనివ్వకుండా చేసి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఈ హత్య విషయంలో రోహిత్ తివారి భార్య అపూర్వను పోలీసులు విచారిస్తున్నారు. రోహిత్, అపూర్వలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే..  పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచి వారిద్దరి మధ్య ఏదో ఒక టెన్షన్ ఉండేదని రోహిత్ తల్లి ఉజ్వల తివారి తెలిపారు.

ఈ నేపథ్యంలో... పోలీసులు రోహిత్ భార్య అపూర్వను విచారిస్తున్నారు. రోహిత్ చనిపోయిన సమయంలో.. ఆమె తల్లి ఉజ్వల మ్యాక్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. కొడుకు ఆరోగ్యం సరిగాలేదని తనకు వచ్చిన సమాచారం మేరకు ఆమె ఇంటికి చేరుకున్నారు. కాగా.. అప్పటికే రోహిత్ కన్నుమూశాడు. 

రోహిత్ కి హత్యకు గల కారకులను కచ్చితంగా పట్టుకొని తీరతామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే రోహిత్ ఇంట్లో పనిచేసే పనిమనుషులను కూడా విచారించామన్నారు. వారి ఇంటి సమీపంలోని సీసీ కెమేరాలో రికార్డు అయిన వీడియోలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఇంటికి వచ్చి ఆయనును హత్య చేశారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని  చెప్పారు.