ప్రతి మనిషికీ కష్టాలొస్తయ్.. వాటికి భయపడని వ్యక్తే లోకం మచ్చే వ్యక్తిగా గుర్తించబడతాడు. ఎందరికో ఆదర్శం అవుతాడు. ఇలాంటి వ్యక్తే దిల్ ఖుష్. ఒకప్పుడు ఈయన ఢిల్లీ రోడ్లపై రిక్షా లాగాడు. ఇయనకు ఫ్యూన్ ఉద్యోగం కూడా రాలేదు. కానీ ఈ ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఒకప్పుడు ప్యూన్ గా కూడా సెలెక్ట్ కాని వ్యక్తి ఇప్పుడు కోట్లకు అధిపతై లోకం మెచ్చే పొజీషన్ కు చేరుకున్నాడు. అంతేకాదండోయ్ ఈయన ఢిల్లీ రోడ్లపై కూడా రిక్షా లాగాడు. ఈ వ్యక్తి ఇప్పుడు కోట్ల రూపాయల క్యాబ్ కంపెనీ యజమాని. ఈయనకు ఒకటి కాదు రెండు కంపెనీలున్నాయి. ఇది బీహార్ లోని సహర్సా జిల్లాకు చెందిన దిల్ ఖుష్ కుమార్ విజయగాథ. నిరుపేదగా ఉన్న దిల్ ఖుష్ కుమార్ కథ నేడు ఎందరికో స్ఫూర్తిదాయకం. నేడు దిల్ ఖుష్ స్వయంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మరి దిల్ ఖుష్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
దిల్ ఖుష్ మొదట్లోనే కారు నడపాలని అనుకున్నాడు. అయితే అతని తండ్రి బీహార్ లో బస్సు డ్రైవర్. తండ్రి వద్దే దిల్ ఖుష్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పాట్నాలో ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వెళ్లినా ఇందులో సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత దిల్ ఖుష్ ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్లారు. అయితే అక్కడ కూడా విఫలమయ్యారు. అయితే దిల్ ఖుష్ కార్ ను నడపాలని అనుకున్నా కార్ల యజమానులు ఎవరూ తమ కార్లను నడపడానికి అనుమతించలేదు. ఆ తర్వాత పెడల్స్ తో రిక్షా నడపాలని నిర్ణయించుకున్నాడు.
రిక్షా నడుపుతున్న సమయంలోనే దిల్ ఖుష్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి పిలిపించారు. ఆ తర్వాత పాట్నాలో డ్రైవర్ గా పనిచేశాడు. దిల్ ఖుష్ తండ్రికి కూడా చాలా తక్కువ జీతం వచ్చేది. దీంతో చిన్నప్పటి నుంచి అతని చదువు బాగాసాగలేదు. ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో దిల్ ఖుష్ 12వ తరగతి వరకే చదివాడు. అంతేకాదు 10 ఏండ్ల వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నాడు.
దిల్ ఖుష్ కుమార్ 2016లో ఆర్యగో అనే సంస్థను స్థాపించారు. అంతేకాకుండా రాడ్ బెజ్ పేరుతో క్యాబ్ కంపెనీని కూడా స్థాపించాడు. ప్రస్తుతం ఆయన కంపెనీ నెట్ వర్క్ లో 4000 కార్లు ఉన్నాయి. దీని ద్వారా సుమారు 500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 29 ఏళ్ల దిల్ ఖుష్ నేడు ఎందరికో స్ఫూర్తి.
దిల్ ఖుష్ కేవలం సెకండ్ హ్యాండ్ టాటా నానోతో రాడ్ బెజ్ ను ప్రారంభించాడు. కానీ రాడ్బెజ్ ప్రారంభించిన తర్వాత కేవలం 6-7 నెలల్లోనే దిల్ఖుష్, అతని బృందం రూ.4 కోట్ల నిధులను సమీకరించగలిగారు. ప్రస్తుతం ఈ సంస్థ పాట్నా నుంచి బీహార్ లోని ప్రతి గ్రామానికి మొదటి దశలో సేవలను అందిస్తోంది. రెండో దశలో నగరం నుంచి నగరానికి అనుసంధానం చేయనున్నారు. బీహార్ లోని ప్రతి గ్రామాన్ని ట్యాక్సీతో అనుసంధానం చేయాలన్నది వారి లక్ష్యం. ఆ తర్వాత బిహార్ వెలుపల కూడా తమ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. పట్టుదల ఉంటే ఎందరికో ఆదర్శం కావొచ్చు.. అనేది దిల్ ఖుష్ కుమార్ ను చూసి నేర్చుకోవచ్చు.
