క్రికెట్ కోచింగ్ కోసం ఈ యువకులు ఎంతపని చేశారంటే

robbers arrested in Bangalore
Highlights

క్రికెట్ అంటే ఆ ఇద్దరు యువకులకు ప్రాణం. క్రికెట్ లో మంచి నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనుకున్నారు. అయితే అందుకు బాగా ఖరీదుతో కూడిన కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుసుకుని నిరుత్సాహపడ్డారు. తమ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలన్న  ఉద్దేశ్యంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుని కటకటాలపాయ్యారు. 

బెంగళూరు జయనగర్ కాలనీకి చెందిన బాలకుమార్(19), నవీన్ శెట్టి(19) లకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. క్రికెట్ లో బాగా రాణించి అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదగాలని ఆశ పడ్డారు. అయితే అందుకు వీరికి పేదరికం అడ్డుగావచ్చింది. క్రికెట్ లో మంచి మెలకువల కోసం కోచింగ్‌ తీసుకునేందుకు బెంగళూరు లోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లారు. అయితే  శిక్షణ కోసం 30 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫీజు కట్టడానికి డబ్బులు లేక చోరీల బాట పట్టారు.

మొదట రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను నకిలీ తాళాలు ఉపయోగించి చోరి చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత దారి దోపిడీలకు పాల్పడటం ప్రారంభించారు. అయితే నిన్న వీరిద్దరు చోరీకి ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల ఇంటరాగేషన్ లో క్రికెట్ కోచింగ్ కోసమే చోరీలకుపాల్పడినట్లు ఈ ఇద్దరు దొంగలు చెప్పారు. వీరి నుండి రూ.27 లక్షల విలువైన బంగారు నగలు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.  

loader